ఐదు నిమిషాల్లోనే క్రెడిట్ కార్డుని ఇలా పొందొచ్చు..!

-

ఈ మధ్య కాలం లో ఎక్కువ మంది క్రెడిట్ కార్డ్స్ ని ఉపయోగిస్తున్నారు. అసలు దీని కోసం మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోజు రోజుకి వీటి వినియోగం పెరిగిపోతుంది. అయితే ఎక్కువ మంది క్రెడిట్ కార్డ్స్ ని వాడడం.. కొత్త వాటి కోసం అప్లై చేసుకోవడం జరుగుతోంది. అయితే కొత్త కార్డు కోసం అప్లై చేసుకోవాలని మీరు అనుకుంటున్నారా..? అది కూడా తక్కువ సమయం లోనే మీరు పొందాలని భావిస్తున్నారా…? అయితే మీరు ఇలా చెయ్యండి. ఇలా కనుక ఫాలో అయ్యారు అంటే పక్కా స్పీడ్ గా కార్డు వచ్చేస్తుంది.

 

credit card | క్రెడిట్ కార్డు

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ తాజాగా ఫిన్‌టెక్ కంపెనీ వన్ కార్డ్‌ తో కలిసింది. అయితే దీనిలో భాగంగా బ్యాంక్ కస్టమర్లకు మొబైల్ ఆధారిత క్రెడిట్ కార్డులను జారీ చేస్తోంది. ఈ నిర్ణయాన్ని పండుగ సీజన్ ముందు తీసుకోవడం జరిగింది. దీనితో ఎక్కువ మంది కస్టమర్స్ కి చేరువ కావచ్చు అని భావించింది.

ఇది ఇలా ఉంటే ఇక క్రెడిట్ కార్డు కంపెనీ ప్రకారం చూస్తే.. వన్ కార్డ్ యాప్ ద్వారా జస్ట్ ఐదే ఐదు నిమిషాల్లో కార్డుని పొందొచ్చని తెలుస్తోంది. అయితే ఇది వర్చువల్ క్రెడిట్ కార్డు. దీన్ని వెంటనే యాక్టివేట్ చేసుకొని ఆన్‌లైన్ షాపింగ్ చేయొచ్చు. ఫిజికల్ కార్డు తర్వాత ఇంటికి వస్తుంది గమనించండి. ఇక ఈ కార్డు ఎవరు పొందొచ్చు అనేది చూస్తే.. 23 నుంచి 35 ఏళ్లలోపు వయసు ఉన్న వారు లక్ష్యంగా కంపెనీ ఈ కార్డును తీసుకువచ్చింది. బ్యాంక్ కూడా ఇదే లక్ష్యంగా నిర్దేశించుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version