పంచామృతంతో ఈ లాభాలని పొందొచ్చు..!

-

పంచామృతం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. పూర్వ కాలం నుండి కూడా పంచామృతం ఉపయోగిస్తున్నారు. పంచామృతం అంటే పాలు, పెరుగు, పంచదార, తేనె మరియు నెయ్యి కలిపి తీసుకోవడం. అయితే ముందు పంచామృతంని ఎలా తయారు చేయాలి అనేది చూద్దాం.

పంచామృతం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టీ స్పూన్ల పాలు, రెండు టీ స్పూన్లు పెరుగు, ఒక టీ స్పూన్ నెయ్యి, ఒక టీ స్పూన్ పంచదార, ఒక టీ స్పూన్ తేనె వేయాలి. అయితే మీరు పాలు వేసేటప్పుడు అవి ఆవు పాలు అయ్యేటట్టు చూసుకోండి. ఇలా వీటినన్నిటినీ మిక్స్ చేస్తే పంచామృతం తయారు అవుతుంది. ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు పొందొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం.

పంచామృతం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు:

ఎనర్జీ:

పంచామృతం తీసుకోవడం వల్ల శక్తి వస్తుంది. పాలు, పెరుగు ఇవన్నీ ఆరోగ్యానికి మంచిది కాబట్టి తక్షణ శక్తి లభిస్తుంది.

సామర్థ్యం పెరుగుతుంది:

ఎముకల ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా మహిళలకు ఇది బాగా పనిచేస్తుంది. నెయ్యిలో విటమిన్ K2 ఉంటుంది. ఇది ఎముకలు కాల్షియం తీసుకునేటట్లు చేస్తుంది.

మెదడు ఆరోగ్యం:

మెదడు ఆరోగ్యానికి కూడా పంచామృతం ఎంతగానో మేలు చేస్తుంది. అలానే జ్ఞాపక శక్తిని పెంచడంలో పంచామృతం సహాయం చేస్తుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది:

పంచామృతం తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలానే జలుబు, ఫ్లూ మొదలైనవి రాకుండా చూసుకుంటుంది.

గర్భిణీలకు మంచిది:

దీనిని తీసుకోవడం వల్ల గర్భిణీలకు చాలా మంచిది. కడుపులో ఉండే బిడ్డ ఎదుగుదలకి ఇది సహాయం చేస్తుంది. చూశారు కదా పంచామృతం వల్ల కలిగే లాభాలు పైగా చిటికలో ఈ మిశ్రమాన్ని మనం కలుపుకుని తాగవచ్చు. దీంతో ఈ సమస్యలన్నిటికీ కూడా చెక్ పెట్టొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news