చాలా మంది సముద్ర ప్రయాణాలు చెయ్యాలని అనుకుంటారు. కానీ ఎప్పటికీ అది అలానే ఉండిపోతుంది. మీకు కూడా సముద్ర ప్రయాణాలు ఇష్టమా..? వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే తప్పక మీరు ఈ ప్యాకేజీని చూడాలి. ఇండియన్ రైల్వేస్ కాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) ప్రత్యేక క్రూజ్ ప్యాకేజీలను తీసుకు రావడం జరిగింది. ఇక పూర్తి వివరాలలోకి వెళితే..
ముంబై నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఓడ ప్రయాణం కోసం కార్డెలా క్రూజెస్తో ఐఆర్సీటీసీ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో సముద్ర తీరం వెంట ఉన్న ప్రాంతాలను చూడాలనుకుంటున్న వారి కోసం క్రూజ్ బుకింగ్ సర్వీస్‌ను ఐఆర్సీటీసీ.. ఈ నెలలోనే ప్రారంభించింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో ప్రయాణం కోసం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ముంబై నుంచి గోవా, డయూ, లక్ష్యదీప్, కొచ్చి లాంటి నగరాలకు వెళ్ళచ్చు. తొలి దశలో ముంబై నుంచి ప్రయాణాలు వున్నాయి. మిగిలిన చోట్లకి కూడా త్వరలో తీసుకు రానుంది.
క్రూస్ వీకెండర్ :
ఈ టూర్ 5 రాత్రుళ్లు, 6 రోజులు. 20 సెప్టెంబర్ న ఇది స్టార్ట్ అవుతుంది. ధర రూ.23,467 నుంచి ఉంటుంది ముంబై నుంచి రెండు ప్రాంతాలకు ప్రయాణం ఉంటుంది.
కేరళ డిలైట్:
ఇది 2 రాత్రుళ్లు, 3 రోజులు టూర్. 20 సెప్టెంబర్ న మొదలు అవుతుంది. ప్యాకేజీ ప్రారంభ ధర రూ.19,898 నుంచి ఉంటుంది. ముంబైలో క్రూజ్ మీద కేరళ వెళ్లి అక్కడ పర్యాటక ప్రాంతాలను చూడచ్చు.
సన్‌డౌనర్ టూ గోవా..
ఇది 2 రాత్రుళ్లు, 3 రోజులు టూర్. 25 సెప్టెంబర్ న స్టార్ట్ అవుతుంది. రూ.23,467 నుంచి
ప్యాకేజీ ఉంటుంది. ముంబై నుంచి గోవాకు సముద్రంపై ప్రయాణించవచ్చు.
లక్ష్యదీప్కు:
ఇది 5 రాత్రుళ్లు 6 రోజులు టూర్. 27 సెప్టెంబర్ న టూర్ స్టార్ట్ అవుతుంది. ప్యాకేజీ ప్రారంభ ధర రూ.49,745 నుంచి మొదలు. మరిన్ని వివరాలు ఐఆర్సీటీసీ టూరిజం అధికారిక వెబ్సైట్ https://www.irctctourism.com/ లో తెలుసుకోవచ్చు.