తెలుగు తెరపై సుమ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. బుల్లితెరపై ఇమే కనిపించిందంటే చాలు తన కామెడీ టైమింగ్ తో ప్రతి ఒక్కరిని ఇంట్రాక్ట్ అయ్యే విధంగా చేస్తూ ఉంటుంది. ఏదైనా సినిమా ఈవెంట్ కోసం సుమని మేకర్ సంప్రదిస్తూ ఉంటారు. బుల్లితెరపై స్టార్ యాంకర్ లిస్టులో ఈమె మొదటి స్థానంలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే సుమ ఎక్కువగా ఫ్యామిలీ విషయాలు పర్సనల్ విషయాలు వైరల్ గా మారుతూ ఉంటాయి.
అసలు విషయంలోకి వస్తే ఇటీవల సుమ మద్రాస్ ఐఐటి కాలేజీకి వెళ్లడం జరిగింది. అక్కడ స్టూడెంట్స్ అడిగిన ఫన్నీ క్యూషన్స్ కి సుమ కొన్ని ఫన్నీ సమాధానాలు తెలియజేసింది. ఈ సందర్భంగా సుమ వారితో మాట్లాడడం జరిగింది నేను పుట్టింది పాలక్కాడ్ 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే యాంకరింగ్ గా మొదలు పెట్టానని తెలిపింది సుమ. జీవితం అంటేనే ఒక పెద్ద చాలెంజ్ అని.. పోయే వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ట్రబుల్ వస్తూనే ఉంటుంది.. ప్రతి ఒక్కరూ ఏం చేయాలనుకుంటున్నామో అది కరెక్ట్ గా చేసినప్పుడే మనందరికీ పేరు వస్తుందని తెలిపింది సుమ.
తన ఏజ్ కి తనకు ఎలాంటి క్లారిటీ లేదని తాను చదివింది బైపిసి అని డిగ్రీల చేరాక బీకాం చేశానని.. ఆ తర్వాత ఎం కామ్ చేశానని తెలిపింది. మందు అకౌంట్ సెక్షన్ లోకి వెళ్దాం అనుకున్న తర్వాత టీచర్ అవుదాం అనుకున్నాను కానీ ఏదో అలా అలా చేస్తూ వెళ్తూ యాంకరింగ్ గా పేరు సంపాదించాలని తెలిపింది. “ఫెస్టివల్స్ ఆఫ్ జామ్ “అనే సంస్థ తన డ్రీమ్ అని ఎందుకంటే తనను ఇంత పాపులారిటీ చేసింది ఆ సంస్ధనే అంటూ తెలియజేసింది. ఇక తన సంపాదిస్తున్న వాటిలో అందరికీ ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతోనే దీనిని స్టార్ట్ చేయడం జరిగింది.నా వంతుగా 30 మంది స్టూడెంట్స్ ను అడాప్ట్ చేసుకొని చదివిస్తున్నానని తెలిపింది. ప్రస్తుతం వాళ్లు బాగా సెటిల్ అయ్యారని నేను వాళ్లతోనే ఉంటాను ఇప్పటికీ అమెరికాలో ఉన్న విదేశాలలో ఉన్న వారు మాతో కోలాబరేట్ అవుతూ ఉంటారని తెలిపింది సుమ. దీంతో ఈ విషయం తెలిసిన వారందరూ సుమ పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.