గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్..ఫ్రీగా సిలెండర్లు..!

-

2023-24 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ సారి బడ్జెట్ మీద చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అయితే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలెండర్ల కి కేంద్రం సబ్సిడీ ని భారీగా పెంచేలా వున్నారు.

అలానే ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ ని కేంద్రం తీసుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. పెరిగిన గ్యాస్‌ ధరల వలన చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పైగా సామాన్యులు కొత్త బడ్జెట్‌ పై కోటి ఆశలు పెట్టుకున్నారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన స్కీమ్ కి కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.5,812 కోట్లు గత ఆర్థిక సంవత్సరం కేటాయించిన సంగతి తెలిసిందే.

ఈ స్కీమ్ తో ఏడాదికి 12 సిలిండర్లకు సబ్సీడీ ని ప్రకటించింది ప్రభుత్వం. సబ్సిడీ కింద ఎల్పీజీ సిలిండర్‌కు రూ.200 అందిస్తోంది. దాదాపు 9 కోట్ల మంది ప్రజలు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ని పొందుతున్నారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న ప్రజలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఈ స్కీమ్ కింద ఇస్తారు. రీఫిల్, స్టవ్ ని ఫ్రీగా ఇస్తారు. అలానే రూ.1,600 ఆర్థిక సహాయం కూడా.

ఇక ఈ స్కీమ్ ఆశలు ఎప్పుడు వచ్చిందనేది చూస్తే.. మోదీ సర్కార్‌ 2016లో ఈ పథకాన్ని ప్రారంభించింది. 2021,ఆగస్టు 10న ఉజ్వల 2.0ను స్టార్ట్ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో మిగతా కుటుంబాలకు కూడా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయాలని కేంద్రం చూస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news