త్రివిక్రమ్ బర్తడే సర్ప్రైజ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

-

మాటల మాంత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు మాటలు అందించిన త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమా ద్వారా డైరెక్టర్ గా అవతారం ఎత్తారు.తరుణ్ , శ్రేయ జంటగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా భారీ వసూళ్ళను కూడా రాబట్టింది. ఇదిలా ఉండగా తాజాగా త్రివిక్రమ్ బర్తడే రోజున సర్ప్రైజ్ ఇవ్వడానికి మేకర్ సిద్ధమయ్యారు . ఈ క్రమంలోనే ఆయన డైరెక్టర్గా తెరకెక్కించిన మొదటి సినిమాను ఆయన పుట్టినరోజు నాడు మళ్ళీ థియేటర్లలో రీ రిలీజ్ చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే నవంబర్ 7వ తేదీన త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన థియేటర్లలో నాలుగవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు ఈ సినిమాను ప్రసారం చేయబోతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా ఎన్నో సినిమాలకు కూడా తన మాటలను అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే ఇక త్రివిక్రమ్ మొదటిసారి దర్శకత్వం వహించిన నువ్వే నువ్వే సినిమా బ్లాక్ బస్టర్ అయి నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చింది. ఆ తర్వాత ఈయన దర్శకత్వంలో సినిమాలు చేయడానికి చాలా మంది హీరోలు ముందుకు వచ్చారు.

నువ్వే నువ్వే రీరిలీజ్ సందర్భంగా ఈ సినిమా నిర్మాత స్రవంతి రవి కిషోర్ మాట్లాడుతూ.. దర్శకుడు త్రివిక్రమ్ కు అడ్వాన్స్డ్ హ్యాపీ బర్తడే అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. నువ్వే నువ్వే సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను స్పెషల్ షో వేసినప్పుడు వచ్చిన స్పందన నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షకులకు ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం మల్లీ రిలీజ్ చేస్తున్నాము. 2 కే హెచ్ డి ప్రింట్ తో ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నాము అంటూ ఆయన వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news