పండగపూట విషాదం.. గుండెపోటుతో యువ క్రికెటర్ మృతి

పండుగ పూట క్రికెట్ లో తీవ్ర విషాదం నెలకొంది. సౌరాష్ట్ర యువ బ్యాటర్ అవి బరోట్ హతస్త్మత్తుగా మరణించాడు. 29 సంవత్సరాల వయసులో గుండెపోటుతో శుక్రవారం మృతి చెందాడు అవి బరోట్. ఏదైనా చేసి ఈ విషయాన్ని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటన చేసింది.

” ఈ వార్త విని ప్రతి ఒక్కరం దిగ్భ్రాంతికి గురయ్యాo. అవి బరొట్ అక్టోబర్ 15 సాయంత్రం గుండెపోటుతో మృతి చెందాడు. సౌరాష్ట్ర క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక స్థానం ఉంది. అతడు లేని లోటు ఎవరూ తీర్చలేనిది” అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్.

కాగా కుడి చేతి వాటం గల అవి బరొట్… అండర్ 19 క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా 2011 సంవత్సరంలో వ్యవహరించాడు. 2019 – 2020 సీజన్ కు గాను రంజీ ట్రోఫీ గెలిచిన జట్టు లో అవి ఒక్కడు. అవి బరోట్ 38 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడగా… 38 లిస్ట్ మరియు 20 దేశవాళీ ట్వంటీ-20 మ్యాచ్లో తన సత్తా చాటాడు. ఇక అవి బరోట్… మృతి పట్ల.. తోటి క్రీడాకారులు సంతాపం వ్యక్తం చేశారు.