Balakrishna AHA Talk Show: ‘ఆహా’లో అద‌ర‌కొడుతున్న బాల‌య్య‌..! ఒక్కో ఎపిసోడ్‌కి అబ్బో అనే రెమ్యూనరేష‌న్..!

Balakrishna AHA Talk Show: నందమూరి న‌ట సింహం బాలయ్య కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. వెండితెరపై కథానాయకుడిగా జోరు చూపిస్తూనే.. ఇప్పుడు ఓటీటీ వేదికగానూ ప్రేక్షకుల్ని తనదైన శైలిలో అలరించడానికి సిద్ధమయ్యారు బాల‌య్య బాబు. ప్రముఖ ఓటీటీ వేదిక‌గా హోస్ట్‌గా మారబోతున్నారు. అల్లు అరవింద్ స్థాపించిన ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్(unstoppable) అనే టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరించ బోతున్నారు. ఆయ‌న హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం.

ఈ టాక్‌ షో తొలి ఎపిసోడ్‌ దీపావళి కానుక గా న‌వంబ‌ర్ 4 న‌స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ మేర‌కు హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో ఈ టాక్ షో కర్టన్ రైజర్ కార్యక్రమంలో వైభవంగా నిర్వహించారు. ఈ షోలో బాల‌య్య బాబు ఎవ‌రిని టార్గెట్ చేయ‌బోతున్నారు? ఈ షోలో తొలి గెస్ట్‌ ఎవరా అని ప్యాన్స్‌ అంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ షోకి సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అంశంపై చ‌ర్చ జరుగుతోంది. ‘అన్‌స్టాప‌బుల్‌’ పేరుతో వస్తోన్న ఈ టాక్‌ షో కోసం బాలయ్య భారీ పారితోషికమే అందుకుంటున్నారట.
బాలయ్య రేంజ్‌, క్రేజ్‌ దృష్టిలో పెట్టుకుని అబ్బో అనే రేంజ్లో భారీ మొత్తంలోనే ముట్టజెప్పుతున్నట్లు తెలుస్తోంది.

ఒక్కో ఎపిసోడ్‌కు ఏకంగా రూ. 40 ల‌క్ష‌లు పారితోషికం పుచ్చుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. తొలి సీజ‌న్‌లో 12 ఎపిసోడ్‌లు గాను ఆయన దాదాపు రూ. 5 నుంచి 6 కోట్ల వరకు అందుకుంటున్నట్లు సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాల్లో త‌న పంచ్ డైలాగ్‌ల‌తో ఆక‌ట్టుకున్న బాల‌య్య బాబు.. ఓటీటీలో ఏమేర ఆక‌ట్టుకుంటారో చూడాలి.