ఇద్దరి యంగ్ హీరోల మధ్య సినిమాల యుద్దం..!!

-

సినిమా ఫీల్డ్ లో అవకాశాలు రావాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం వుండాలి. అలాగే దర్శక నిర్మాతలను బుట్టలో వేసుకునే తెలివి ఉండాలి. వాళ్ళతో ఎప్పుడూ టచ్ లో ఉండాలి.అలాగే కొత్తగా ఎలా అప్డేట్ కావాలి అనే అంశాలు కూడా ఎప్పటికప్పుడు పరిశీలించు కుంటూ వెళ్లాలి. అలాగే సినిమా పరిశ్రమ లో కుళ్ళు కుతంత్రాలు కూడా ఉంటాయి, వాటిని తట్టుకొనే తెలివి తేటలు కూడా వుండాలి. లేక పోతే ఎప్పుడు ఎవర్ని తొక్కాలా అని ఆలోచిస్తూ ఉండే వారు కూడా ఉంటారు.

ఇక వారి పక్కన ఉండే భజన బ్యాచ్ కూడా వారిని ఎప్పుడూ పొగుడుతూ ఉంటారు. రీసెంట్ టాలీవుడ్ లో ఇద్దరు యంగ్ హీరోలు తెగ దెబ్బలాట నడుస్తూ ఉందట.ఈ విషయం ఇప్పటి వరకు  బయటకు అయితే రాలేదు కానీ ఆ ఇద్దరు హీరోల మధ్య పచ్చ గడ్డి వేస్తే బగ్గుమని అనేలా ఉంది అని అంటున్నారు.

ఇక వీరిలో ఒక యంగ్ హీరో బిహేవియర్ కొంచెం ఎగ్రెసివ్ గా ఉంటుంది. ఇతగాడి సినిమా  కొన్ని కారణాల వల్ల. ఆగి పోయింది. దానిపై సదరు నిర్మాత కూడా హడావుడి చేశారు. ఆ హీరో తో చస్తే సినిమా తీయను అని మొండి పట్టుదలతో ఉంటే ఇక ఆ హీరో అంటే పడని మరో హీరో నేను చేస్తా అని లైన్ లోకి వచ్చాడట. ఆ నిర్మాత పట్టుదల తో ముందు అనుకున్న పారితోషికం కంటే ఎక్కువ ఇవ్వడానికి రెడీ అయ్యాడట. ఫైనల్ గా ఆ హీరో నటించక పోతే సినిమా ఆగి పోదని సింబాలిక్ గా చెప్పాలని నిర్ణయించు కున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news