ఫోన్‌ చేస్తే 3 గంటల్లోగా బెడ్‌ కేటాయించాలి.. జగన్ కీలక ఆదేశాలు !

-

కోవిడ్‌ నివారణ, కరోనా వాక్సినేషన్‌ పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ 104 కాల్‌ సెంటర్‌కు మరింత ప్రాచుర్యం కల్పించాలని, కోవిడ్‌ సోకిన వారికి ఆ సెంటర్‌ సహాయ సహకారాలు అందించాలని అన్నారు. కోవిడ్‌ లక్షణాలు ఉన్న వారు ఎక్కడికి పోవాలో సూచించాలని అన్నారు. ఫోన్‌ చేస్తే 3 గంటల్లోగా బెడ్‌ కేటాయించాలని ఆస్పత్రుల్లో అవసరమైన దానికన్నా ఎక్కువ ఆక్సీజన్‌ ఉంచాలని అన్నారు.

రెమ్‌డెస్‌విర్‌ ఇంజెక్షన్లు కూడా అందుబాటులో ఉంచాలని అన్నారు. హోం ఐసొలేషన్‌లో ఉన్న వారిని కూడా ఫాలోఅప్‌ చేయాలని అన్నారు. కోవిడ్‌ వాక్సిన్ల కోసం మరోసారి కేంద్రానికి లేఖ రాయండని అన్నారు. గ్రీవెన్స్ కోసం 1902 నెంబరు, కోవిడ్‌ సేవల కోసం104 నెంబరు కేటాయించండన్న జగన్ ఈ రెండు నెంబర్లను విస్తృతంగా ప్రచారం చేయండని అన్నారు. ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను బస్టాండ్‌ వంటి పబ్లిక్‌ ప్లేసుల్లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయండని అన్నారు. కోవిడ్‌ పరీక్ష మొదలు వైద్యం, మెడిసిన్, శానిటేషన్, క్వాలిటీ ఆఫ్‌ ఫుడ్‌ వరకు.. ఏమాత్రం రాజీ పడొద్దని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news