ఏపీలో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి సీఎం జగన్ సిద్ధమయ్యారా? ఊహించని విధంగా క్యాబినెట్‌లో మార్పులు చేయనున్నారా? ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో నడుస్తున్న చర్చలు ప్రకారం చూస్తే..ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది. అసలు జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఒకేసారి 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని పాలన మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
అయితే అప్పుడు మంత్రివర్గంలో ఛాన్స్ దక్కనివారికి..మళ్ళీ రెండున్నర ఏళ్లలో మంత్రివర్గంలో మార్పులు చేసినప్పుడు అవకాశం ఇస్తానని చెప్పారు. అయితే జగన్ ఇచ్చిన మాట ప్రకారం చూస్తే గత డిసెంబర్‌కు రెండున్నర ఏళ్ళు ముగిశాయి..ఇక అప్పుడు మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని ప్రచారం జరిగింది..పైగా 100 శాతం మార్పులు ఉంటాయని టాక్ నడిచింది. అంటే ఉన్న 25 మందిని తీసేసి కొత్తగా 25 మందిని మంత్రివర్గంలో తీసుకుంటారని ప్రచారం వచ్చింది.
అయితే కోవిడ్ వల్ల సరిగ్గా సమయం దొరకలేదని, కాబట్టి మరో ఆరు నెలల పాటు పదవులు ఉంచాలని కొందరు మంత్రులు జగన్‌ని రిక్వెస్ట్ చేసినట్లు తెలిసింది. దానికి జగన్ ఓకే చెప్పారని కథనాలు కూడా వచ్చాయి. కానీ సడన్‌గా ఇప్పుడు జగన్ మంత్రివర్గంలో మార్పులు చేయడానికి సిద్ధమయ్యారని తెలిసింది. ఈ నెల 18న మంత్రివర్గంలో మార్పులు చేయడానికి జగన్ సిద్ధమయ్యారని తెలుస్తోంది. అప్పుడు క్యాబినెట్‌లో మార్పులు చేస్తారని టాక్.
అయితే 100 శాతం మంత్రివర్గాన్ని మార్చేసి కొత్త నేతలకు ఛాన్స్ ఇస్తారా? అనేది క్లారిటీ లేదు. కాకపోతే కొందరు మంత్రులని అయితే పక్కన పెట్టడం గ్యారెంటీ అని తెలుస్తోంది. పనితీరు బాగోని వారిని, ఈ రెండున్నర ఏళ్లలో ఎక్కువ వివాదాల్లో ఉన్న మంత్రులని సైడ్ చేసి, వారి స్థానాల్లో కొత్త వారికి మంత్రులుగా అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి పదవి కోసం చాలామంది ఎమ్మెల్యేలు కాచుకుని కూర్చున్నారు. మరి వారిలో ఎవరికి ఛాన్స్ దొరుకుతుందో చూడాలి..అలాగే ఈ నెలలోనే జగన్ క్యాబినెట్ మారుస్తారేమో చూడాలి.