మరింత తగ్గిన బంగారం ధర.. అదే బాటలో వెండి..!

-

బంగారం ధర మరింతగా తగ్గింది. మొన్నటివరకు పెరుగుతూ వచ్చిన పసిడి ధర నిన్నటి నుంచి ఒక్కసారిగా తగ్గుతూ వస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం నాటికి బంగారం ధర స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. బంగారం బాటలోని వెండి నడుస్తోంది. దేశవ్యాప్తంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో రూ.350 తగ్గడంతో ధర రూ.41,450కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో రూ.380 తగ్గడంతో ధర రూ.45,220కి చేరింది.

బంగారం
బంగారం

10 గ్రాముల బంగారం ధర..
రాష్ట్రాల వ్యాప్తంగా బంగారం ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. చెన్నై పట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.41,810 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,610కి చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,430 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.44,430కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,560కి చేరింది. కోల్‌కతా పట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,820 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,520కి చేరింది. బెంగళూరు నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.41,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,220 గా ఉంది. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.41,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,220కి చేరింది. విజయవాడ, విశాఖపట్నంలో హైదరాబాద్‌లో కొనసాగిన ధరలే కొనసాగాయి.

కేజీ.. వెండి ధర..
బంగారం ధరతోపాటు వెండి ధర కూడా తగ్గుతూ వచ్చాయి. నిన్నటి నుంచి వెండి ధరలు భారీగా తగ్గుతూ వస్తోంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధరకు రూ.600 తగ్గడంతో ధర రూ.69,800కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో కేజీకి రూ.780 తగ్గడంతో రూ.65,420కి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news