ఆ ఇలాఖా నుంచే జగన్ స్థానిక ఎన్నికల గుర్రం పరుగు స్టార్ట్ ?

-

2019 సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో విజయం సాధించిన వైయస్ జగన్ అదే జోరు స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపించాలని మంచి పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో సంక్షేమం మరియు అభివృద్ధి గట్టిగా జరుగుతున్న నేపథ్యంలో కచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అత్యధిక మెజారిటీ స్థానాలు గెలవడం గ్యారెంటీ అనే ధీమా లో ఉన్నారు. దీంతో చాలా వరకు స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను మంత్రులకు అప్పగించారు వైయస్ జగన్. Image result for kodali nani jaganఅయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల పరిస్థితి ఎలా ఉన్నది జగన్ నమ్మిన బంటు మంత్రి కొడాలి నాని మాత్రం కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో తన బాస్ వైయస్ జగన్ కి నియోజకవర్గంలో అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను గెలవటానికి మొత్తం రంగం సిద్ధం చేశారు. దాదాపు ఇప్పటికే వార్ వన్ సైడ్ అయినట్లు కృష్ణా జిల్లాలో వార్తలు వినపడుతున్నాయి. గుడివాడ నియోజకవర్గంలో చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు కి పగ్గాలు అప్పజెప్పారు.

 

అయినా గాని పెద్దగా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలం లేకుండా పోయింది. గుడివాడ నియోజకవర్గంలో బలమైన కేడర్ మొత్తం కొడాలి నాని దగ్గర ఉండటంతో…గుడివాడలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ ఎన్నికల విజయం గుర్రం ఇక్కడి నుంచి అనగా కొడాలి నాని ఇలాకా నుంచే స్టార్ట్ అయినట్లే అని అంటున్నారు ఆ ప్రాంతంలో ఉన్న సీనియర్ రాజకీయ నేతలు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక గుడివాడ నియోజకవర్గంలో అత్యధిక అభివృద్ధి పనులు జరగడంతో ప్రస్తుతం గుడివాడ మొత్తం వైసిపి పార్టీ మాయమైనది అనే టాక్ బలంగా నడుస్తోంది. 

Read more RELATED
Recommended to you

Latest news