ఒక వైపు ఎన్నికలు.. మరోవైపు పార్టీ పరిస్తితిని గాడిలో పెట్టడం.. ఈ రెండు సమస్యలతోనే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం చంద్రబాబు సతమతమవుతుంటే.. ఆయనకు దెబ్బపై దెబ్బ మాదిరిగా.. పార్టీ నుం చి కీలక నేతలు జారుకుంటున్నారు. అది కూడా కీలకమైన సమయాల్లోనే వారు పార్టీకి రిజైన్ చేయడం.. దీని వల్ల కేడర్‌లో తీవ్రమైన మానసిక ఆందోళనలు రేకెత్తడం వంటి పరిణామాలతో టీడీపీ కుంగిపోతోంది. వరుస గా సోమవారం నుంచి జరిగిన పరిణామాలను గమనిస్తే.. అధికార పార్టీ నేత, సీఎం జగన్ వ్యూహాత్మకంగా చం ద్రబాబుపై రివేంజ్ తీర్చుకుంటున్నారేమో.. అనే భావన కలుగుతోంది.
సోమవారం మాజీ మంత్రి, నిన్న మొన్నటి వరకు టీడీపీలోనే ఉన్న ఎస్సీ నాయకుడు, పైగా రాజధాని ప్రాం తానికి చెందిన డొక్కా మాణిక్య వరప్రసాద్.. టీడీపీకి రిజైన్ చేశారు. అదేసమయంలో వైసీపీ తీర్థం పుచ్చుకు న్నారు. ఫలితంగా డొక్కా విషయం టీడీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. ఆయన కు పార్టీలు మారే అలవాటు ఉంది. నిలకడ లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే.. డొక్కా నే అంటూ.. చంద్రబాబు తన అనుకూల మీడియాలో ప్రచారం చేసుకున్నారు. ఇక, ఈయనతో పాటు మాజీ ఎమ్మెల్యేరెహమాన్ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణుల నుంచి ఎస్సీ, మైనార్టీ నాయకులు వచ్చేయడంతో ఒకింత ఓదార్పు కోల్పోయిన పరిస్థితి కనిపించింది.
ఇక, ఇది జరిగి 24 గంటలు కూడా గడవకముందుగానే.. కడప జిల్లాలో పులివెందుల నియజకవర్గం ఇంచా ర్జ్‌గా ఉన్న సతీష్ రెడ్డి కూడా టీడీపీకి రిజైన్ చేయడం సంచలనం సృష్టించింది. కడపలో టీడీపీకి సతీష్ చాలా కీలకనేతగా వ్యవహరించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రెండుసార్లు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రెండుసార్లు సతీష్ రెడ్డి పోటీ ఇచ్చారు. వారి చేతిలో ఓటమి పాలైనప్పటికీ… పులివెందు లలో బలమైన నేత కావాలి కాబట్టి టీడీపీ సతీష్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే కాకుండా మండలి చైర్మన్‌ను చేసింది. అయితే, కొన్నాళ్లుగా ఆయన తీవ్రఅంసతృప్తితో ఉన్నారు.
ఈ క్రమంలో పార్టీ ఆయనను పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు వైసీపీ గూటికి చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. సరే! రాజకీయాల్లో ఎందరో నేతలు పార్టీ మారుతుంటారు. వస్తుంటారు. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినా.. కీలకమైన ఎన్నికల సమయంలో టీడీపీని వ్యూహాత్మకంగా జగన్ దెబ్బకొట్టడం మాత్రం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది., చంద్రబాబు తనకు తాను మేధావినని అనుకున్నా.. జగన్ ముందు బలాదూర్ అనే వ్యాఖ్య వినిపిస్తోంది.