బిగ్ బ్రేకింగ్ : టీడీపీ నుంచి అచ్చన్నాయుడు జంప్ ?? 

-

తెలుగుదేశం పార్టీకి చెందిన ఉత్తరాంధ్ర ప్రాంతం కీలక నాయకుడు ఎమ్మెల్యే అచ్చన్నాయుడు. చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేసిన ఈయన ఎప్పటినుండో ఉత్తరాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కీలక వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటున్నారు. ముఖ్యంగా టిడిపి అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ ని చాలా దారుణంగా విమర్శించిన నేతగా అచ్చన్నాయుడు కి మంచి పేరు ఉంది. Image result for acham naiduఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వైసిపి పార్టీ అధికారంలో ఉన్న తరుణంలో అచ్చన్నాయుడు కాస్త సైలెంట్ అయ్యారు. ఇవన్నీ పక్కనపెడితే ఇటీవల వైయస్ జగన్ మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ ను తెరపైకి తీసుకురావడం జరిగింది.  అయితే ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ మాత్రం తన హయాంలో రాజధానిగా ప్రకటించిన అమరావతి నే రాజధానిగా పెట్టాలని జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అయితే జగన్ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఉత్తరాంధ్ర ప్రాంతానికి దగ్గరగా వైజాగ్ నీ రాజధానిగా గుర్తించగా, రాయలసీమ ప్రాంతంలో కర్నూల్ ని రాజధానిగా గుర్తించడం జరిగింది.

 

ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో వైసీపీ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. అయితే ఉత్తరాంధ్ర ప్రాంతంలో బలమైన నాయకుడిగా అచ్చన్నాయుడు క్యాడర్ మాత్రం తెలుగుదేశం పార్టీలోనే విధేయుడిగా ఉంటూ రాజకీయాలు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఉత్తరాంధ్రలో జగన్ తన పార్టీకి బలమైన ప్రత్యర్థిగా ఉన్న అచ్చన్నాయుడు పై రాజకీయ వ్యూహంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నుండి జంప్ అయ్యి …వైసీపీ పార్టీలోకి అచ్చన్నాయుడు వస్తున్నట్లు పుకార్లు పుట్టిస్తున్నారు అని ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. 

Read more RELATED
Recommended to you

Latest news