సీఎం జగన్ కి ఎదురుదెబ్బ..!

-

ఆంధ్రప్రదేశలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార వైసిపి అనుసరిస్తున్న వైఖరి ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను,నాయకులను అదేవిధంగా పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని అధికార వైసిపి అరాచకాలు సృష్టిస్తూ వస్తుంది అని ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. ప్రధానంగా రాయలసీమ ప్రాంతాల్లో వైసీపీ నేతల అరాచకాలు కు సంబంధించి కొన్ని వీడియోలు ఆ పార్టీని ఇరకాటంలో పడేస్తున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థుల నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కుని చించివేయడం వారిపై దాడులు చేయటం వంటి చర్యలకు అధికార పార్టీ నేతలు దిగుతున్నారు.నాలుగు రోజుల నుంచి ఈ వ్యవహార శైలి తీవ్రంగా ఉంది దీనిపై ఇప్పుడు అధికార పార్టీలోనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా మాచర్లలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు బుద్ధ వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావు ల పై జరిగిన దాడి ఆందోళన కలిగిస్తోంది.

ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్న పల్నాడులో ఇప్పుడు మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు భగ్గుమంటున్నాయి అని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిషోర్ అనే వ్యక్తి బోండా ఉమ అదేవిధంగా న్యాయవాది కిషోర్, బుద్ధ వెంకన్న కార్లను లక్ష్యంగా చేసుకుని పెద్దపెద్ద కర్రలతో దాడులు చేయడం కారును వెంబడించి ఆ కర్రతో ఆయన చేసిన దాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇలాంటి వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని ఇది ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా సూచిస్తున్నారు.

ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకువెళ్తాయి అని గతంలో అంటే మీడియా ఉండేది కాదు కాబట్టి ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రజలకు అంతగా వెళ్ళేది కాదని ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా తో పాటు ప్రధాన మీడియా కూడా యాక్టివ్ గా ఉంది .కాబట్టి ప్రజల్లోకి ఇలాంటి చర్యలు అత్యంత వేగంగా వెళ్తాయని అంతిమంగా జగన్ పాలన అంటే ప్రజలు భయపడి పోయే పరిస్థితులు వస్తాయని ఆ వైసీపీ కార్యకర్తలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పోలీసుల మీద కూడా వైసిపి కార్యకర్తలు దాడి చేయడం అనేది ఇప్పుడు ఆందోళన కలిగించే విషయం.

Read more RELATED
Recommended to you

Latest news