బ్రేకింగ్‌ : ఏపీ ఆర్టీసీపై జ‌గ‌న్ మ‌రో కీల‌క నిర్ణ‌యం..

-

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని సీఎం జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. అన్నట్టుగానే అధికారంలోకి వచ్చాక ఆ దిశగా చర్యలు చేపట్టారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణ సంస్ధ (ఆర్టీసి) పేరును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రజారవాణా శాఖగా మార్చబోతున్నారు. ఆర్టీసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ హోదాను కమీషనర్‌ లేదా చీఫ్‌ కమీషనర్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టుగా మార్చబోతున్నట్లు తెలిసింది. అయితే రవాణా శాఖకు కమీషనర్‌ ఉన్నారు.

బ్రేకింగ్‌ : ఏపీ ఆర్టీసీపై జ‌గ‌న్ మ‌రో కీల‌క నిర్ణ‌యం..
బ్రేకింగ్‌ : ఏపీ ఆర్టీసీపై జ‌గ‌న్ మ‌రో కీల‌క నిర్ణ‌యం..

పబ్లిక్‌ రవాణా శాఖకు కమీషనర్‌, చీఫ్‌కమీషనర్‌ హోదా కన్నా డెరెక్టర్‌ జనరల్‌ (డిజి) హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌ను స్వయంగా కలిసి కొంతమంది ఐపిఎస్‌ అధికారులు, రిటైర్డు ఐపిఎస్‌ అధికారులు కోరినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టుగా పేరు మార్చిన అనంతరం ప్రస్తుత ఆర్టీసి సంస్థలో ఎవరెవరు ఏ హోదాలో పని చేస్తున్నారో ఆ హోదాల పేర్లన్నీమార్చబోతున్నారు.

ఇక నుండి జీత భత్యాలు కూడా ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వ ఖజానా నుండి చెల్లించనున్నారు. అలాగే మరి కొద్ది రోజులలో ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణ సంస్థ పేరు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ హోదాపై ఏ పేరు పెట్టాలి అనే విషయంపై స్పష్టమైన నిర్ణయం వెలువడనుంది. ముఖ్యమంత్రి జగన్‌ ఐఎఎస్‌ల వైపు మొగ్గు చూపుతారా.. ఐపిఎస్‌ల వైపు మొగ్గు చూపుతారా వేచి చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news