జగన్ మరో చారిత్రాత్మక నిర్ణయం… మనసున్న మనిషి!

-

జగన్ ని నిశితంగా గమనించిన వారికి… ఇప్పటివరకూ చూసిన నాయకులకు జగన్ కు చాలా వ్యత్యసం ఉందన్న విషయం అత్యంత సులువుగా కనిపెట్టేస్తారు! జగన్ ని ముందునుంచీ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్ధం అవుతుంది! రాష్ట్రంలో ప్రతీ అంశంలోనూ తనదైన మార్కు ఉండాలి.. ప్రజలకు మరింత ప్రయోజనకరంగా ఉండాలి అని! అంతకు మించి ఏమిటంటే… జగన్ ఎప్పుడూ ఈరోజు గురించి మాత్రమే అలోచించడు.. “నేడు” ఎంత ముఖ్యమో “రేపు” అంతే ముఖ్యం అంటాడు.. రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి “నేడు” ఎంత ముఖ్యమో “నాడు” కూడా అంతే ముఖ్యం అని చెబుతుంటాడు!!

jagan
jagan

అవును… గతంలో బాబు ఏమి చేయలేకపోయాడో చెప్పడం మాత్రమే జగన్ పని కాదు! నాడు బాబు ఏమిచేయలేకపోయాడు.. తాను ఏమిచేస్తున్నాను.. ఎలా చేస్తున్నాను.. రేపు భవిష్యత్ తరం తనను ఎలా గుర్తిస్తుంది! అన్నది మాత్రమే జగన్ ఉద్దేశ్యంగా కనిపిస్తుంది. ఇప్పటివరకూ ప్రభుత్వ పాఠశాలలపై చిన్నచూపు చూసిన నాయకులకు జ్ఞానం కలిగేలా… నాడు – నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాల దశ దిశ మారుస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులపై దృష్టి సారించారు జగన్!

ప్రభుత్వ ఆసుపత్రులు అంటే… ఎప్పుడూ ఇలానే ఉంటాయి.. ఇలా ఉంటేనే వాటిని ప్రభుత్వ ఆసుపత్రులు అని అంటారు.. పేదవాడికోసం ఇంతకు మించి చేయకూడదు.. కార్పొరేట్ ఆసుపత్రులను కూడా బ్రతకనివ్వాలి.. వంటి ఆలోచనలతో సాగిన కాలంపోయింది!! అవును… తాజాగా అమరావతిలో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఆస్పత్రులలో నాడు-నేడు కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేపడుతున్న మార్పులతోపాటు కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాల ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఇదే క్రమంలో… రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నిర్మించబోయే ప్రభుత్వ ఆస్పత్రులు చరిత్రలో నిలిచేపోయే విధంగా ఉండాలని సూచించిన జగన్… ప్రభుత్వ ఆస్పత్రులన్నింటని కార్పొరేట్ స్థాయికి ధీటుగా నిర్మించాలని.. ఆ ఆస్పత్రుల్లో సకల సౌకర్యాలు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు!! ప్రభుత్వ ఆసుపత్రులకు ఆ స్థాయి వైభవం తీసుకురావాలనే ఆలోచన రావడం ఆనందం అయితే… కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులు సామాన్యుడికోసం కట్టాలని భావించడం మహదానందం అని చెబుతున్నారు ఏపీ వాసులు!! దీంతో… జగన్ మగడ్రా బుజ్జీ అంటూ నెటిజన్లు హడావిడి చేస్తున్నారు!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news