ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014లో ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు అమరావతి రాజధాని గా ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంలో అమరావతి ప్రాంతంలో అనేక ప్రయోగాలు మరియు 20 అంతస్తుల భవనాలు నిర్మించబోతున్నట్లు సింగపూర్ తరహాలో అమరావతి ప్రాంతంలో బిల్డింగులు ఉండబోతున్నట్లు గ్రాఫిక్స్ వీడియోస్ అనేకమైనవి చంద్రబాబు చూపించడం జరిగింది. కానీ ఐదు సంవత్సరాల పరిపాలనలో సరైన భవనం ఒక్కటి కూడా అమరావతి ప్రాంతంలో నిర్మించ లేకపోయారు. ఇదే తరుణంలో అమరావతి రాజధాని విషయంలో అప్పట్లో మంత్రివర్గంలో ఉన్న నారా లోకేష్ కూడా అమరావతి విషయంలో గతంలో భవనాలు గురించి అనేక కామెంట్లు చేయడం జరిగింది.
కానీ ఒక్క దానికి కూడా నిర్మాణాల పనులు జరగలేదు. ఇటువంటి తరుణంలో లోకేష్ కూడా చేయలేనిది మరి చంద్రబాబు కూడా చేయలేనిది ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వినబడుతున్నాయి. విషయంలోకి వెళితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని గా విశాఖపట్టణం నగరాన్ని 3 రాజధానులలో ఒకటిగా గుర్తించడం జరిగింది. ఈ నేపధ్యంలో అమరావతిలో గ్రాఫిక్స్ లో భవనాలు చూపించిన చంద్రబాబుకి మరియు లోకేష్ కి దిమ్మతిరిగిపోయే విధంగా రియల్టీలో విశాఖపట్టణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 20 అంతస్తులతో మిలీనియం టవర్స్ 1 బి కట్టబోతున్నారు.
ఈ భవనంలో నేరుగా పై అంతస్తు వరకు వెళ్లే విధంగా సౌకర్యాలను కల్పించనున్నారని సమాచారం. వాహనాలు కూడా పైకి వెళ్లే విధంగా అత్యాధునిక టెక్నాలజీలను వినియోగించబోతున్నారని సమాచారం అందుతోంది. ఖచ్చితంగా ఈ టవర్ నిర్మాణం జరిగితే విశాఖకు అదనపు లుక్ దేశవ్యాప్తంగా తో పాటు అంతర్జాతీయ స్థాయి వస్తుందని చాలా మంది మేధావులు అంటున్నారు. అంతేకాకుండా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని కూడా చాలా స్పీడుగా కంప్లీట్ చేయాలని సెక్రటేరియట్ నుండి ఎనిమిది చోట్ల పిల్లర్లు వేసి 15 కిలోమీటర్ల దూరంతో డైరెక్ట్ ఎయిర్ పోర్ట్ కి వెళ్లే విధంగా రోడ్డు వెయ్యాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం.