వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు, పార్టీ కార్యకర్తలకు మధ్ద తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వైఎస్ షర్మిలను పోలీసులు హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా బీఎన్ రెడ్డి నగర్ శ్యామ్ ఆస్పత్రి ముందు రోడ్డుపై షర్మిల బైఠాయించారు. ఈ క్రమంలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసానికి ఆమెను తరలిస్తున్నారు. గిరిజన మహిళ లక్ష్మికి తక్షణమే న్యాయం చేయాలని రంగారెడ్డి జిల్లా సాగర్ ప్రధాన రోడ్డుపై షర్మిల ఆందోళనకు దిగారు.
రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు షర్మిలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే వైఎస్సార్టీపీ నాయకులు, పోలీసులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు లాఠ్ చార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. వైఎస్ షర్మిలను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. గిరిజన మహిళ లక్ష్మికి న్యాయం చేయాల్సిందేనని.. అప్పటి వరకూ తమ పోరాటం కొనసాగుతుందని వైఎస్ షర్మిల హెచ్చరించారు.