అప్పుడు అన్న కోసం నిలబడ్డా… ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతున్నా : వైఎస్‌ షర్మిల

-

ఒకప్పుడు అన్న కోసం పాదయాత్ర చేశా… ఇప్పుడు న్యాయం కోసం నిలబడ్డానని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. న్యాయం గెలుస్తుందా? నేరం గెలుస్తుందా? అని ప్రపంచమంతా చూస్తోందని వ్యాఖ్యానించారు. పులివెందులలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. కడప ప్రజలు న్యాయాన్ని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైసీపీపై తీవ్రంగా ఫైర్ అయ్యారు.

ఎంపీగా అవినాష్‌ రెడ్డి కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఒక్క ఉద్యమం కూడా చేయలేదు. హత్యలు చేయడానికే అధికారం వాడుకుంటున్నారు. అవినాష్‌ నిందితుడని సీబీఐ చేసిన ఆరోపణల ప్రకారమే మాట్లాడుతున్నాం. కాల్‌ రికార్డ్స్‌, గూగుల్‌ మ్యాప్స్‌ వంటి ఆధారాలన్నీ ఉన్నాయి. బాబాయిని చంపిన హంతకులనే సీఎం కాపాడుతున్నారు. జగన్‌కు అధికారమిచ్చింది ఆయన్ను కాపాడటానికేనా? అని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు.

మరోవైపు మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మాట్లాడుతూ.. న్యాయం కోసం పోరాడుతున్నామని చెప్పారు. ఈ పోరాటంలో కోర్టు తీర్పు చాలా ఆలస్యం కావొచ్చని.. ప్రజా తీర్పు పెద్దదని.. దానికోసం షర్మిల ఎంపీగా పోటీ చేస్తున్నారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news