ఢిల్లీలో కాదు.. ప్రగతి భవన్ ముందు కవిత ధర్నా చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఎమ్మెల్సి కవిత మహిళ రిజర్వేషన్ల మీద పోరాటం చేయాలి అనుకుంటే ముందు ప్రగతి భవన్ ఎదురుగా చెయాలని..లిక్కర్ స్కామ్ నుండి తప్పించుకోవడానీకె ఈ డ్రామాలు అన్నారు. మహిళల మీద గౌరవం ఉంటే వాళ్ల పార్టీ నేతలు గవర్నర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎందుకు స్పందిచలేదని.. 2014లో ఎంత మంది మహిళలకు కేసీఆర్ రాజకీయంగా ఆవకాశం కల్పించారని ఫైర్ అయ్యారు.
2018లోఎంత మందికి ఛాన్స్ ఇచ్చారని నిలదీశారు. అసలు రాష్ట్రంలో మహిళ కమిషన్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారని.. బతుకమ్మ ముసుగులో లిక్కర్ స్కామ్ కు తెర లేపిన కవిత ఎపిసోడ్ ఇప్పుడు బిఅరెస్ నేతలకు ఆందోళన కలిగిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు భద్రతా ఉంటుందని హామీ ఇచ్చే వరకు వైఎస్ ఆర్టీపి పోరాటం చేస్తుందని.. కొంచెం నడుస్తూ , కారులో జర్నీ చేస్తున్న రేవంత్ రెడ్డి ది పాదయాత్ర అంటారా అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావని తెలిపారు వైఎస్ షర్మిల.