ఇంట్లో ఎంత మంది వృద్దులు ఉంటే.. అందరికీ పెన్షన్లు ఇస్తా : షర్మిల

-

ఇంట్లో ఎంత మంది వృద్దులు ఉంటే.. అందరికీ పెన్షన్లు ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ షర్మిల. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం లక్ష్మీపల్లి గ్రామంలో షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ అని కేసీఅర్ మోసం చేశారని.. తీసుకున్న రుణాలు కట్టలేక ఉన్న పొలాలు అమ్ముకుంటున్నామని చెప్పారు.

బ్రతుకు దెరువు లేక ఇంకా బొంబాయి పోతున్నామని.. ఉద్యోగాలు లేక పిల్లలు ఇంట్లనే ఉంటున్నారని.. కేసీఅర్ ప్రభుత్వం తో మాకు ఏం మేలు జరగలేదని పేర్కొన్నారు. అన్ని ధరలు పెంచి బ్రతుకు కష్టం చేశారని.. వైఎస్సార్ ఉన్నప్పుడు చల్లగా బ్రతికామని గుర్తు చేశారు. కేసీఅర్ చేసిన మోసాలు ప్రజలు తెలుసుకుంటున్నారని.. గ్రామాల్లో కనీసం ఆసరా పెన్షన్లు ఇచ్చే దిక్కు కూడా లేదని నిప్పులు చెరిగారు.

వ్యవసాయం పండుగ అని కేసీఅర్ అంటున్నారు…కానీ స్వయంగా రైతులే దండుగ అంటున్నారని.. ఉద్యోగాలు లేక ఇంకా బ్రతుకు దేరువుకు వలసలు పోవాల్సిన పరిస్థితి ఉందని విమర్శలు చేశారు. ఇక కేసీఅర్ ను నమ్మొద్దని.. వైఎస్సార్ పాలన తేవాలి అంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కి అధికారం ఇవ్వండని కోరారు. వైఎస్సార్ పథకాలు అన్ని అమలు చేస్తానని.. తీసుకున్న రుణాలు అన్ని మాఫీ చేస్తానని ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news