జామపండ్లలో ఎన్ని రకాలుంటాయి.. అవి ఏ నేలల్లో పెరుగుతాయి..?

-

జామపండు అంటే ఇష్టపడని వారుండరు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరి ఫేవరెట్ జామ. పల్లెల్లో అయితే దాదాపు ప్రతి ఇంట్లో జామచెట్టు ఉంటుంది. పట్టణ వాసులు జామపండు తినాలంటే జేబు ఖాళీ చేసుకోవాల్సిందే. మరి అందరికి ప్రియమైన ఈ జామపండు దిగుబడి ఎక్కువ రావాలంటే రైతులు ఏ నేలలో ఈ పంటను పండించాలో తెలుసా..?

 

జామ తోటలకు క్షార నేలలు సరైనవని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. నీరు ఇంకే గరప నేలలు, ఒండ్రు నేలలు కూడా అనువైనవని తెలిపారు. చిత్తడి నేలలు అంతగా అనుకూలం కాదని చెప్పారు. పీహెచ్ సూచిక 5.5 నుంచి 7.5 మధ్య ఉండే సారవంతమైన నేలలు జామతోటలకు అనుకూలమని అంటున్నారు.

మరి ఈ జామ తోటలు దిగుబడి బాగా రావాలంటే ఎలాంటి వాతావరణంలో ఉండాలంటే.. ఉపఉష్ణమండల వాతావరణంలో జామ ఏపుగా పెరుగుతుంది. పొడి వాతావరణంలో పండ్ల నాణ్యత మెరుగ్గా ఉంటుంది అని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

  • జామ పండులో తెలుపు, ఎరుగు రంగు రకాలుంటాయని మనకు తెలుసు కదా.. తెలుపు రంగులో ఉండే జామను లక్నో 49 అని అంటారు. ఇది చాలా తీయగా ఉంటుంది. ఇది ఎక్కువగా తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్రలో లభిస్తుంది. హెక్టారుకు ఈ రకం 25 టన్నుల దిగుబడి ఇస్తుంది.
  • జామలో మరో రకం అలహాబాద్ సఫేదా. ఇది ఉత్తరప్రదేశ్‌లో అత్యంత ప్రసిద్ధ చెందిన రకం. చెట్టు బలమైన శాఖలు, దట్టమైన ఆకులతో మధ్యస్థ ఎత్తులో ఉంటుంది. పండ్లు మధ్యస్థ పరిమాణంలో (180గ్రా), గుండ్రంగా ఉంటాయి.
  • బనారసి రకం జామపండ్లు 4.0 నుంచి 5.5 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. ఈ పండ్లు లేత పసుపు రంగులో ఉంటాయి. ఈ రకాలను ఎక్కువగా ప్రాసెసింగ్ ఫుడ్ కోసం వాడతారు.
  • చిట్టిదార్ రకం జామ సఫేదాను పోలి ఉంటుంది. ఈ పండుపై గులాబీ, ఎరుపు రంగు చుక్కలు ఉంటాయి.
  • మరో రకం జామ.. హరిజా. ఈ రకం 3.5 నుంచి 4.5 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. చాలా తక్కువగా కొమ్మలు కలిగి ఉంటుంది. పండ్లు గుండ్రంగా ఉంటాయి, తీపి రుచితో ఆకుపచ్చని పసుపు రంగులో ఉంటాయి.
    రెడ్ ఫ్లెడ్ రకం జామ చెట్టు 3-5 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. పై భాగం పసుపు రంగుని కైలిగి ఉండి లోపల గుజ్జు గులాబీ రంగు లో ఉంటుంది.
  • అర్కా మృదుల రకం అలహాబాద్ సఫేదా మొలకల నుంచి వస్తుంది.ఈ మొక్కలు పాక్షికంగా ఎత్తుగా ఉంటాయి. పండ్లు గుండ్రంగా 180 గ్రా. బరువుతో ఉంటాయి పై భాగం పసుపు రంగులో లోపటి గుజ్జు తెలుపు రంగులో మృదువుగా ఉంటుంది.పెక్టిన్ శాతం అధికంగా ఉండటం వల్ల ఈ రకం పండ్లను విస్తృతంగా ప్రాసెసింగ్ కోసం వినియోగిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news