తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్.. చెప్పు కింద బందీ అయ్యింది – వైఎస్ షర్మిల

-

ఖమ్మం కల్లూరు మండలం బత్తుపల్లి లో వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆమె.. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరి ఉంటే ప్రజలు సంతోషంగా ఉండే వాళ్ళు అన్నారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరక పోగా..తెలంగాణ కేసీఆర్ చేతుల్లో బంది అయ్యిందని.. కేసీఆర్ కి వ్యతిరేకంగా లేచిన ప్రతి గొంతును అనిచి వేస్తున్నాడని పేర్కొన్నారు.

పోలీస్ లను పనోల్లుగా వాడుకుంటున్నారని.. ఎక్కడ ఉంది గౌరవం…తెలంగాణ ఆత్మగౌరవమన్నారు. ప్రతి పక్షాలను మార్కెట్ లో పెట్టీ పశువులను కొన్నట్లు కొంటున్నారని.. తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్…దొర ఎడమ కాలి చెప్పు కింద బందీ అయ్యిందని విమర్శించారు. ఎన్ని వాగ్ధానాలు ఇచ్చాడో కేసీఆర్ గుర్తు చేసుకోవాలని.. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ దరిద్రం మనమే మోయలేక పోతున్నాం..ఇక దేశానికి కావాలా ? వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news