ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముద్దుల తనయుడు మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు. అయితే… ఈ సందర్భంగా ఇప్పటికే పలువురు సెలబ్రీటీలు మరియు రాజకీయ నాయకులు కేటీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. అయితే.. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు నేపథ్యంలో వైఎస్ షర్మిల కూడా సంచలన ట్వీట్ చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు మంత్రి కేటీఆర్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసింది వైఎస్ షర్మిల. “కేసీఆర్ గారి కొడుకు మంత్రి కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో పాటు .. నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపె హృదయాన్ని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష 91 వేల ఉద్యోగాలను భర్తీ చేసే పట్టుదలను..54 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చిత్తశుద్ధిని, విద్యార్థులకు పూర్తి ఫీజ్ రిఎంబర్స్మెంట్ ఇచ్చె మనసుని..ఇవ్వాలని కోరుకొంటున్నాను.” అంటూ వైఎస్ షర్మిల పేర్కొన్నారు. కాగా.. ఇటీవలె ఆమె… ఎవరు కేటీఆర్… నాకు తెలీదు అన్నట్లుగా మాట్లాడిన సంగతి తెలిసిందే.