వరి కొనడం చేత కాని సీఎం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేని సీఎం మాకొద్దు- వైఎస్ షర్మిళ సంచలనం

-

ఆత్మహత్య చేసుకున్న ఓ ఒక్క కుటుంబాన్ని కూడా కేసీఆర్ పరామర్శించలేదని… చేతకాని సీఎం మాకొద్దని అంటున్నామని తీవ్రస్థాయిలో మండి పడ్డారు వైఎస్సార్టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ. మద్దతు ధర అన్నది రైతు హక్కు…బీజేపీకి కానీ కేసీఆర్ కు గానీ ఈ పంట వేయవద్దనే హక్కు లేదు అని అన్నారు. మద్దతు ధర ప్రకటించిన తర్వాత ఈ పంట వేయద్దనే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని ఆమె అన్నారు. పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వాలు కొనాల్సిందే.. కేసీఆర్ కేంద్రానికి అమ్ముకుంటాడో, పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు అమ్ముకుంటారో ఆయన ఇష్టమని.. బాయిల్డ్ రైస్ గా అమ్ముకుంటారో.. బంగారంగా అమ్ముకుంటారో కానీ కొనాల్సిందే అని డిమాండ్ చేసింది. ధాన్యం కొనుగోలుపై బీజేపీ, టీఆర్ఎస పార్టీలు రాజకీయం చేస్తున్నారు.

దున్నపోతుపై వానపడినట్లు.. ఎంతమంది చనిపోతే నాకేంటని కేసీఆర్ అనుకుంటున్నాడు. మనరాష్ట్రంలో రైతులు చనిపోతే పట్టించుకోని కేసీఆర్..ఎక్కడో హర్యాణాలో రైతుల చనిపోతే పరిహారం ఇస్తామంటున్నారని విమర్శించారు. కేసీఆర్ కు చేతనైంది కేవలం గలీజ్ తిట్లు, గారడి మాటలు అని ఎద్దేవా చేశారు. వరి కొనడం చేత కానీ సీఎం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేని సీఎం మాకొద్దు అని అన్నారు. కేటీఆర్ నల్లగొండ జిల్లాలో ర్యాలీ తీస్తే రాని కరోనా.. ప్రతిపక్షాలు ఏదైనా కార్యక్రమాలకు అనుమతులు అడిగితే.. కోవిడ్ రూల్స్ ను చూపి అనుమతులు ఇవ్వడం లేదని విమర్శించారు. కరోనా రూల్స్ కేసీఆర్, కేటీఆర్ కు వర్తించవా అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news