ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. నేడే ఆ నిధులు ఖాతాల్లో !

-

ఆంధ్రప్రదేశ్ రైతులకు ఏపీ ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. ఈరోజు వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల పధకం కింద వడ్డీ రాయితీ సీఎం వైఎస్ జగన్ జమ చేయనున్నారు. 6,27,906 లక్షల రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.128.47 కోట్లు సీఎం జగన్ జమ చేయనున్నారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో 11 గంటలకు వర్చువల్ విధానంలో నేరుగా రైతుల బ్యాంక్‌ ఖాతాలలో జమ చేయనున్నారు  సీఎం వైఎస్‌ జగన్‌.  వ్యవసాయ అవసరాల కోసం రూ.లక్ష లోపు పంట రుణాలు తీసుకుని సకాలంలో వాయిదా చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీ దక్కేది.

రైతులు కట్టిన 4 శాతం వడ్డీ మొత్తాన్ని ‘వడ్డీ లేని రుణ పథకం’ కింద గతంలో బ్యాంకులో జమ చేసేవారు. రుణాలు సకాలంలో చెల్లించినప్పటికీ ఎప్పుడో రెండు మూడేళ్లకు ప్రభుత్వం జమ చేసే ఈ మొత్తాన్ని అప్పులిచ్చే సమయంలో బ్యాంకర్లు సర్దుబాటు చేసుకునే వారు.  అయితే, రూ.లక్ష లోపు పంట రుణాలపై రైతులు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ’ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.  

Read more RELATED
Recommended to you

Latest news