కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో విద్యా సంస్థలు మళ్ళీ మూతపడుతున్నాయి. అటు పరీక్షలపైనా కూడా అటు విద్యార్థుల్లో వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కాగా ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.
అనంతరం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు మాట్లాడుతూ పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి వరకు రేపటి నుంచి సెలవులు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. అలానే 1 నుంచి 9 తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు ఉండవని స్పష్టం చేశారు. ఈ ఏడాది విద్యాసంవత్సరం కూడా పూర్తయినట్లు మంత్రి తెలిపారు.ఇక బోర్డు పరీక్షలపై కూడా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతితో పాటు ఇంటర్ పరీక్షలు యధావిధిగా జరుగుతాయని మంత్రి స్పష్టం చేసారు. విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. పరీక్షల నిర్వహణ సమయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.