సోష‌ల్ మీడియాలో ఈ వైసీపీ ఎమ్మెల్యేల‌దే హ‌వా…!

-

క‌రోనా నేప‌థ్యంలో కేవ‌లం ప్ర‌జ‌లు మాత్ర‌మే కాదు.. నాయ‌కులు కూడా చాలా మంది ఇళ్ల‌కే ప‌రిమిత ‌మ‌వు తున్నారు. ఇంకొంద‌రు త‌మ కార్యాల‌యాల్లోనే ఉంటూ.. ప్ర‌జ‌ల‌కు చేత‌నైనంత మేర‌కు సాయం అందిస్తు న్నా రు. మ‌రికొంద‌రు ప్ర‌జ‌ల్లోకి వెళ్లి సాయం అందించ‌డమో.. వారికి అందుతున్న సేవ‌ల‌ను ప‌రిశీలించ ‌డ‌మో చేస్తున్నారు. దీంతో చాలా మంది నాయ‌కులు ఇప్ప‌టికే విమ‌ర్శ‌ల పాల‌య్యారు.  ముఖ్యంగా ప్ర‌ధా న ప్ర‌తి ప‌క్షం నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చేందుకు జంకుతున్నారు.

అలాగ‌ని క‌రోనా క‌ష్ట కాలంలో ప్ర‌జ‌ల‌కు ఏదైనా సేవ చేయ‌క‌పోతే ఎలా అని చింతిస్తున్న నాయ‌కులు కూ డా ఉన్నారు. వీరిలో వైసీపీ నాయ‌కుల్లో యువ నేత‌లు వినూత్నంగా సేవ అందిస్తున్నారు.  సోష‌ల్ మీడి యాను వేదిక‌గా చేసుకుని నాయకులు ప్ర‌జ‌ల‌కు సందేహాలు తీరుస్తున్నారు. అదేస‌మ‌యంలో సాయం చేసేందుకు కూడా సోష‌ల్ మీడియాను వినియోగించుకుంటున్నారు.

యువ ఎమ్మెల్యేలు ఉన్న‌త విద్య‌ను చ‌దువుకున్న‌వారు ఉన్నారు. వీరు సోష‌ల్ మీడియా ద్వారా నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌ల‌కు సందేశాలు పంపుతున్నారు. క‌రోనా జాగ్ర‌త్త‌లు స‌హా.. ప్ర‌భుత్వం పంపిణీ చేస్తున్న సాయం వంటి వివ‌రాల‌ను వారు సోషల్ మీడియా వే దిక‌గా పంచుకుంటున్నారు. ఇక‌, వివిధ వ‌ర్గాల‌ను ఉద్దేశించి ఫేస్‌బుక్ లైవ్‌లో ప్ర‌సంగిస్తున్నారు. ఇక‌, వా ట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఎక్క‌డ ఏం జ‌రిగినా.. క్ష‌ణాల్లో తెలుసుకునేలా నాయ‌కులు ప‌క్కా ప్ర‌ణాళిక ఏర్పాటు చేసుకున్నారు.

ఈ నేప‌థ్యంలో చాలా వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌రోనా తీవ్ర‌త పెర‌గ‌కుండా ముందు జాగ్ర‌త్త‌లు తీసుకునేందుకు, ప్ర‌జ‌ల‌కు విలువైన సందేశాలు ఇచ్చేందుకు కూడా యువ నేత‌లు చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న‌డంలో సందేహం లేదు. మొత్తానికి నాయ‌కులు త‌మ ప‌రిధిలో బాధ్య‌త‌ల‌ను ఆన్‌లైన్‌చేసుకుని వ్య‌వ‌హ‌రించ‌డం కొత్త ప‌రిణామ‌మని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Latest news