వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చిన అభయహస్తం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం నీరుగార్చిందని విమర్శించారు. ట్విట్టర్ లో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పొదుపు సంఘాల మహిళలకు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా ఉండాలని YS రాజశేఖర రెడ్డి గారు చేసిన ఆలోచనల ఫలితమే అభయహస్తం పథకమని.. 2017 వరకు అమలైన పథకంలో మార్పులు తీసుకొస్తామని చెప్పిన కేసీఆర్ సర్కార్ ఐదేండ్లయితున్న ఇప్పటివరకు అమలు చేసింది లేదన్నారు. అభయహస్తం పథకం కింద డబ్బులు కట్టిన మహిళలకు తిరిగి ఇచ్చింది లేదని…ఇంటికో పెన్షనంటూ మెలికలు పెట్టి, పథకాన్ని అటకెక్కించి, వృద్ధ్యాప్య మహిళలకు ఆర్థిక భరోసా లేకుండా చేశారని విమర్శించారు. ఆసరా పెన్షన్స్ తో సంబంధం లేకుండా అభయహస్తం పథకాన్ని తిరిగి కొనసాగించాలని… లేదంటే మహిళలు కట్టిన డబ్బులు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని వైఎస్ షర్మిళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అభయ హస్తం పథకాన్ని తిరిగి ప్రారంభించాలి, లేదంటే వడ్డీలో డబ్బులు చెల్లించాలి…. ప్రభుత్వానికి వైఎస్ షర్మిళ డిమాండ్
-