ధాన్యం కొనుగోలులో బీజేపీ, టీఆర్ఎస్ లు రైతులకు సున్నం పెడుతున్నాయి. – వైఎస్ షర్మిళ

-

వరి కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రైతులకు సున్నం పెడుతున్నాయని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ విమర్శించారు. శనివారం జరిగిన రైతువేదన దీక్షలో ఆమె బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలను విమర్శించారు. వడ్ల కుప్పలపైనే రైతులు చనిపోతున్నా.. కేసీఆర్ కు చలనం లేదు. వడ్లు కొనడంలో కేసీఆర్ కు ఇబ్బంది ఏమిటి..? కేంద్రానికి ఎందుకు ఏజెంట్ గా మారారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం విధించే ఆంక్షలపై ఎందుకు సంతకాలు పెట్టావని ప్రశ్నించారు. కేంద్రం ఆంక్షలు పెట్టిన రోజే ఢిల్లీలో ధర్నాలు చేయాలి, ప్రెస్ మీట్లు పెట్టాలి..కానీ అది చేత కాక ఇక్కడ ధర్నాలు చేస్తారా..? అని అంది. వడ్లు కొనుగోలు చేతకాక ధర్నాలు చేస్తున్నారని విమర్శించింది. పక్క రాష్ట్రాలకు రైతుల మీద ఉన్న చిత్తశుద్ది కేసీఆర్ కు ఎందుకు లేదని ప్రశ్నించింది.

వైఎస్ ష‌ర్మిల‌ | Ys Sharmila

ప్రజల గొంతు నొక్కేయాలని ధర్నా చౌక్ మూసేయాలని చూసిన కేసీఆర్ కు మళ్లీ అదే వేదిక దిక్కైందని ఎద్దేవా చేశారు. 36 లక్షల మందికి రుణమాఫీ ఎగ్గొట్టిన మోసగాడు కేసీఆర్ అన్నారు షర్మిళ. ఉచిత ఎరువుల హామీ ఇంకెప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించింది. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన చరత్ర కేసీఆర్ ది అని విమర్శించింది.

Read more RELATED
Recommended to you

Latest news