విరాట్ కోహ్లీ ఒక G.O.A.T: యువరాజ్ సింగ్

-

ఇండియా నిన్న ఆడిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై విజయం సాధించడంపై సర్వత్రా ప్రశంశల వర్షం కురుస్తోంది. వన్ డౌన్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ మరోసారి ఛేజింగ్ లో తాను ఎంత స్పెషల్ ప్లేయర్ అన్నది నిరూపించుకున్నాడు. తాజాగా ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ప్రదర్శన గురించి మాజీ ఇండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ కొన్ని కామెంట్స్ చేశాడు. ఒత్తిడి అంతా తీసుకుని చివరి వరకు క్రీజులో ఉండి తన టీం ను విజయతీరాలకు చేర్చాడు అంటూ విరాట్ కోహ్లీని యువరాజ్ సింగ్ ప్రశంసలతో ముంచెత్తాడు. విరాట్ కోహ్లీ ఒక G.O.A.T అంటూ స్పెషల్ కామెంట్ చేశాడు యువి. కానీ ఫ్యాన్స్ అందరూ ఈ పదాన్ని చూడగానే వేరే విధంగా అర్ధం చేసుకోవద్దు G.O.A.T అంటే GREATEST OF ALL TIME అని అర్ధం.

విరాట్ తో పాటుగా మ్యాచ్ విజయంలో కీలక పాత్రలు పోషించిన జడేజా మరియు షమీ ల బౌలింగ్ గురించి కూడా యువరాజ్ సింగ్ మెచ్చుకున్నారు. అయితే దురదృష్టవశాత్తూ కోహ్లీ సెంచరీ కి మరో అయిదు పరుగుల దూరంలో ఉండగా అవుట్ అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news