కామారెడ్డి నుండే పోటీ చేస్తా: షబ్బీర్ అలీ

-

తెలంగాణాలో నవంబర్ నెలాఖరులో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్, BRS మరియు బీజేపీ లు ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అన్ని పార్టీల నుండి సీట్లు దక్కని అసంతృప్తులు బయటకు వస్తున్నారు.. ఇక తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ తాను ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్న విషయం గురించి కంఫర్మ్ చేశారు. ఇతను తెలిపిన ప్రకారం కామారెడ్డి నుండి పోటీ చేస్తున్నారట. కానీ ఇంతకు ముందు వరకు సీఎం కేసీఆర్ కామారెడ్డి లో పోటీ చేస్తున్నారు.. అందుకోసం షబ్బీర్ అలీ తన స్థానాన్ని మార్చుకుంటున్నారు… ఎల్లారెడ్డి, నిజామాబాద్, జూబిలీ హిల్స్ లలో ఒక దాని నుండి పోటీ చేస్తారు అన్న వార్తలు రావడంతో షబ్బీర్ అలీ ఈ విషయాన్నీ స్పష్టం చేశారు.

మరి ఈ నియోజకవర్గంలో గెలుపు ఎవరిని వరిస్తుంది అన్నది తెలియాలంటే మరో నెలన్న రోజులు పాటు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news