Australia vs Zimbabwe : ఆసీస్ జట్టును మట్టికరిపించిన జింబాబ్వే..చరిత్రలో తొలిసారిగా

-

టౌన్స్ విల్లీ వేదికగా మూడో వన్డేలో ఆస్ట్రేలియాకు జింబాబ్వే భారీ షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియా తో మూడే వన్డేలో జింబాబ్వే సంచలన విజయం సాధించింది. మూడు వికెట్ల తేడాతో అతిథ్య కంగారులను ఓడించి భారీ షాక్ ఇచ్చింది. తద్వారా మూడు వన్డే ల సిరీస్ లో ఆసీస్ ఆదిత్యాన్ని 2-1కి తగ్గించి క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకుంది.

కాగా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్ లో భాగంగా మూడు వన్డేలు ఆడేందుకు జింబాబ్వే, ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళింది. మొదటి రెండు మ్యాచ్ లలో ఆరోన్ ఫించ్ బృందం పర్యాటక జింబాబ్వే మీద వరుసగా 5, 8 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయాలు సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.

ఇక నామమాత్రపు మూడో వన్డేలోనూ నెగ్గి సిరీస్ ను క్లీన్ స్లీప్ చేయాలని భావించింది. అయితే, అనూహ్య రీతిలో రేగిస్ చకబ్వ బృందం ఆసిస్ కు షాక్ ఇచ్చింది. ఇక అంతకుముందు టాస్ ఓడి తోలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను 141 పరుగులకే జింబాబ్వే కుప్ప కూల్చింది. జింబాబ్వే బౌలర్లలో స్పిన్నర్ ర్యాన్ బర్లు 5 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా పథకాన్ని శాసించాడు. ఆ లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి, జింబాబ్వే సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news