Zomato ’10 నిమిషాల్లో డెలివరీ సర్వీస్’ నిలిపివేత

-

ఆర్డర్ చేసిన వెంటనే క్షణాల్లో ఫుడ్‌ను డెలివరీ చేసే జొమాటో తన కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్ చెప్పింది. జొమాటో తన బెస్ట్ సర్వీస్‌ను నిలిపి వేయనున్నట్లు సమాచారం. ‘ఆర్డరు తీసుకున్న 10 నిమిషాల్లో ఆహార పదార్థాలు సరఫరా చేస్తామంటూ’ 2022 మార్చిలో జొమాటో ఇన్‌స్టంట్‌ ప్రకటించింది. ఇప్పుడీ సేవను నిలిపివేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు రెస్టారెంటు భాగస్వాములకు కంపెనీ ఇటీవల సమాచారమిచ్చిందని అవి పేర్కొన్నాయి.

కఠిన మార్కెట్‌ పరిస్థితుల్ని తట్టుకుని, లాభాదాయకత పెంచుకునేందుకే జొమాటో ఈ సేవలను ప్రారంభించింది. అయితే ఈ సేవలతో లాభదాయకత పెరగకపోగా, స్థిర వ్యయాలు చెల్లించేందుకు అవసరమైన పరిమాణంలో రోజువారీ ఆర్డర్లు కూడా లభించడం లేదని తెలుస్తోంది. అందుకే ఈ సేవలు నిలిపివేసి, ఆ స్థానంలో మరో కొత్త సేవను 7-10 రోజుల్లో ప్రవేశ పెట్టనున్నట్లు చెబుతున్నారు.

తక్కువ విలువ కలిగిన ప్యాక్డ్‌ మీల్స్‌ (థాలి, కాంబో మీల్స్‌) వంటి వాటిని సరఫరా చేసేందుకు సంస్థ ప్రయోగాత్మకంగా అడుగులు వేసే అవకాశం ఉంది. ఇన్‌స్టంట్‌ సేవలు నిలిపివేయడం లేదని, రీబ్రాండింగ్‌ చేస్తున్నామని జొమాటో తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news