జొమాటో డెలివ‌రీ బాయ్‌.. 5 నెల‌ల జీతాన్ని పొదుపు చేసి స్పోర్ట్స్ బైక్ కొన్నాడు..!

-

హ‌ర్యానాలోని క‌ర్నాల్‌కు చెందిన సూర‌జ్ అనే యువ‌కుడు స్థానికంగా జొమాటో డెలివ‌రీ బాయ్‌గా ప‌నిచేస్తున్నాడు. 5 నెల‌ల పాటు క‌ష్ట‌ప‌డి సొమ్మును జ‌మ చేసి చివ‌ర‌కు తాను క‌ల‌లు క‌న్న స్పోర్ట్స్ బైక్‌ను కొనుక్కున్నాడు.

క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తే అంతే.. ఎవ‌రైనా ఏదైనా సాధించ‌వ‌చ్చు.. ఒక స్థిర‌మైన ల‌క్ష్యం అంటూ ఉన్నాక‌.. దాని కోసం ఎంత వ‌ర‌కైనా శ్ర‌మించ‌వ‌చ్చు. నిత్యం క‌ఠోర శ్ర‌మ చేస్తే ఏదో ఒక రోజు అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించ‌వ‌చ్చు. అవును, సరిగ్గా ఇదే సూత్రాన్ని న‌మ్మాడు క‌నుక‌నే.. అత‌ను 5 నెల‌ల పాటు త‌న జీతం మొత్తాన్ని పొదుపు చేసుకున్నాడు. చివ‌ర‌కు తాను క‌ల‌లు క‌న్న స్పోర్ట్స్ బైక్‌ను కొనుక్కున్నాడు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

హ‌ర్యానాలోని క‌ర్నాల్‌కు చెందిన సూర‌జ్ అనే యువ‌కుడు స్థానికంగా జొమాటో డెలివ‌రీ బాయ్‌గా ప‌నిచేస్తున్నాడు. అయితే అత‌నికి కేటీఎం డ్యూక్ 220 సీసీ స్పోర్ట్స్ బైక్‌ను కొనాల‌ని కోరిక‌. కానీ అత‌నికి వ‌చ్చే జీతంతో ఆ బైక్ రాదు. క‌నుక క‌ష్ట‌ప‌డి ప‌నిచేసి డ‌బ్బుల‌ను పొదుపు చేయాల‌నుకున్నాడు. అనుకున్న‌దే త‌డ‌వుగా ఆ ప‌ని ప్రారంభించాడు. 5 నెల‌ల పాటు క‌ష్ట‌ప‌డి సొమ్మును జ‌మ చేసి చివ‌ర‌కు తాను క‌ల‌లు క‌న్న ఆ స్పోర్ట్స్ బైక్‌ను కొనుక్కున్నాడు.

అయితే అంత‌టి ఖ‌రీదైన బైక్‌పై వెళ్తూ జొమాటో డెలివ‌రీ బాయ్‌గా ప‌నిచేస్తున్నాడేమిటబ్బా.. అని అంద‌రూ అత‌ని క‌థ‌ను వాక‌బు చేయ‌గా.. అస‌లు విష‌యం తెలిసింది. దీంతో సూర‌జ్ స్టోరీని కొంద‌రు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా.. ఆ పోస్టుల కాస్తా వైర‌ల్ అయ్యాయి. వాటిని చూసిన జొమాటో ఫౌండ‌ర్ దీపీంద‌ర్ గోయ‌ల్ ట్విట్ట‌ర్‌లో స్పందిస్తూ.. సూర‌జ్ స్టోరీ అత‌నిలాంటి యువ‌కుల‌కు ప్రేర‌ణ‌గా నిలుస్తుంద‌ని, క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే ఎవ‌రికైనా స‌క్సెస్ వ‌స్తుంద‌ని, జొమాటో సంస్థ‌లో ఇలాంటి స‌క్సెస్ స్టోరీలు ఇంకా ఎంతోమందికి ఉండే ఉంటాయ‌ని అన్నారు. ఏది ఏమైనా.. సూర‌జ్ మాత్రం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో యూత్‌కు బాగా ఇన్‌స్పిరేష‌న్ అయిపోయాడు. అంత క‌ష్ట‌ప‌డి అత‌ను డ‌బ్బును పొదుపు చేసుకుని అత‌ని డ్రీమ్ బైక్‌ను కొని, అత‌ని ల‌క్ష్యాన్ని సాధించాడంటే.. అందుకు అత‌న్ని అంద‌రం అభినందించాల్సిందే క‌దా.. ఏమంటారు..!

Read more RELATED
Recommended to you

Latest news