గాల్వాన్ ఘర్షణ తరువాతా భారత ప్రజలందరూ చైనా వస్తువులను యాప్ లను నిరాకరిస్తున్నారు. సరిహద్దుల్లో సైనికులు యుద్ధం చేస్తుంటే దేశ ప్రజలు తమ ఇళ్ళలో ఉండి చైనా మార్కెట్ పై యుద్ధం ప్రకటించారు. ఈ మేరకు చైనా యాప్ లను బ్యాన్ చేసే దిశలో టిక్ టాక్ పబ్ జీ యాప్ లను డిలీట్ చేయడం ప్రారంభిచారు. ఇపుడు ఇదే తరహాలో చైనా పెట్టుయబడులు పెట్టిన జొమాటో యాప్ వైపు చూపు మరల్చారు. చైనా పెట్టుబడులు పెట్టిన కంపెనీలో ఉద్యోగాలు చేయమంటు కొందరు జొమాటో డెలివరీ బాయ్స్ నిర్ణయం తీసుకున్నారు. వారి జొమాటో షార్ట్ లను తగలబెట్టి తమ నిరసనను తెలియజేశారు. దేశం పై తమకున్న దేశభక్తిని చాటుకున్నారు. ఉద్యోగం లేకపోతే పస్తులు ఉంటాం తప్ప చైనా కంపెనీల్లో పని మాత్రం చెయ్యము అని వారు తెలియజేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో లో జరిగింది.
వారెవ్వా…! జొమాటో బాయ్స్ చేసిన పనికి నేటిజెన్స్ ఫిదా..!
-