అనంతపద్మనాభుడి సాక్షిగా పంద్రాగస్టులోపు రైతులకు 2లక్షల రుణమాఫీ చేసి వారి రుణం తీర్చుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాండూరులో నిర్వహించిన జనజాతర సభలో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వికారాబాద్-అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది ఈరోజు కాలుష్యం అయింది. మోడీ, అమిత్ షా సంక్రాంతి పండుగకు గంగెరెద్దుల్లా మన దగ్గరికీ వస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. బీఆర్ఎస్, బీజేపీల కారణంగానే రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదన్నారు. ఈ పదేళ్లలో బీజేపీ రాష్ట్రానికి ఏం ఇచ్చిందని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ అడిగితే మోడీ ఇవ్వలేదన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చెవెళ్ల అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.