ఏపీ యువకుడికి థ్యాంక్ చెప్పిన కేటీఆర్

-

తెరాస అధినేత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని కోరుకుంటూ..పాదయాత్ర చేపట్టిన యువకుడికి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.  నెల్లూరుకు చెందిన రోహిత్ కుమార్ రెడ్డి గులాబీ దుస్తుల్లో కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని కోరుతూ.. టీఆర్ఎస్ జెండాతో కాలినడకన విజయవాడ నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేపట్టాడు…దీంతో ఇందుకు సంబంధించిన వీడియోను నెటిజన్ ఒకరు కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.. రోహిత్ అభిమానానికి ఫిదా అయిన కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు చెప్పారు.

ఏపీలో నూ తెరాస అభిమానులు ఉన్నారనే సంగతి గతంలో అనేక సార్లు ఫ్లెక్సీల రూపంలో కనబడింది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ఏపీ ప్రజల్లోనూ సదాభిప్రాయం ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news