ఐపీఎల్ 2023: “స్లో పిచ్” పై లక్నో ఆటగాళ్ల పోరాటం … !

-

లక్నో సూపర్ జయింట్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్యన జరుగుతున్న మ్యాచ్ లో లక్నో ఆటగాళ్లు పరుగులు తీయడానికి చమటోడుస్తున్నారు. ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై కెప్టెన్ ధోని సరైన నిర్ణయమే తీసుకున్నాడనిపిస్తోంది. ఎందుకంటే అప్పుడే వర్షం పాడడం వలన పిచ్ అంతా బౌలింగ్ కు అనుకూలించేలా కనిపించింది. అందుకు తగ్గట్లే చెన్నై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి మొదటి ఓవర్ నుండి లక్నో ఆటగాళ్లను సూపర్ గా కట్టడి చేశారు. మ్యాచ్ ఎంత దారుణంగా సాగింది అంటే ఒక్కరు కూడా బౌండరీ తరలించాలంటే భయపడేలా ఆ పిచ్ పై బంతి టర్న్ అవుతూ ఉంది.

రాహుల్ లేకపోవడంతో ఈ మ్యాచ్ లో కృనాల్ పాండ్య కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. మేయర్ , మనన్ వోహ్రా , కరణ్ శర్మ, కృనాల్ పాండ్య మరియు స్టాయినిస్ లు ఘోరంగా విఫలం అయ్యారు. కాగా లక్నో మొదటి ఇన్నింగ్స్ లో కనీసం 130 పరుగులు అయినా చేస్తుందా సందేహమే అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news