చంద్రబాబు చిప్పకూడు తినే రోజులు వచ్చాయి – మంత్రి రోజా

-

టిడిపి అధినేత నారా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిలో భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో అవకతవకలు జరిగినట్లు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సీట్ పై టిడిపి నేతలు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయడంతో న్యాయస్థానం స్టే విధించింది. అయితే హైకోర్టు స్టే విధించడంపై సుప్రీంకోర్టుకు వెళ్లిన ఏపీ ప్రభుత్వానికి ఊరట లభించింది.

హైకోర్టు విధించిన స్టే ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు సీట్ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సుప్రీం తీర్పుతో చంద్రబాబు అండ్ కో జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు మంత్రి రోజా. ఇన్నాళ్లు చేసిన తప్పులకు స్టే లు తెచ్చుకుంటూ బతికారని.. కానీ ఇప్పుడు చంద్రబాబు పాపాలు పండాయని, ఆయన జైలుకు వెళ్లి చిప్పకూడు తినే రోజులు వచ్చాయన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఒక విజయం అన్నారు రోజా. చంద్రబాబు ప్రజల దగ్గర నుండి కోట్లు దోచుకు తిన్నాడని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ ఇచ్చిన సూట్ కేసులను లెక్కపెట్టిన భువనేశ్వరి లెక్కలు బయటకి వస్తాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news