తెరాస ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పను సంబంధించి సీనియర్ నేత కేకే ఆధ్వర్యంలో మేనిఫెస్టో కమిటీ తెరాస భవన్లో శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.. 2014లో మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలతో పాటు అదనంగా అమలు చేశామన్నారు. ప్రస్తుత మేనిఫెస్టో పై మరో నాలుగైదు సార్లు కమిటీ సమావేశమైతే తుది రూపు వస్తోందని కేకే పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు, వారికి అన్ని విధాల తోడ్పాటుని అందించే విధంగా మేనిఫెస్టోని రూపొందిస్తున్నట్లు తెలిపారు. తెరాస అధినేత కేసీఆర్ తో చర్చించిన తర్వాత మేనిఫెస్టోకి తుది రూపు వస్తోందని కేకే పేర్కొన్నారు. ఈ సమావేశానికి మంత్రులు హరీష్ రావు, పద్మారావుగౌడ్ తదితర నేతలు పాల్గొన్నారు.