తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి నెల అయిన సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. జవాబుదారీతనం,పారదర్శకత, సమర్థవంతమైన పాలనకు ప్రభుత్వ నిబద్ధత ఇదే నిదర్శనమన్నారు. ప్రజలతో బలమైన అనుబంధాన్ని నెలకొల్పేందుకు తాము కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. మంత్రులు, అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం అందుబాటులో ఉన్నారన్నారు. ప్రజలు కొత్త స్వాతంత్ర భావాన్ని అనుభూతి చెందుతున్నారని అన్నారు.గత నెల రోజులుగా పౌర సరఫరాల నీటి పారుదల శాఖల పనితీరును అంచనా వేసేందుకు పలు సమీక్షా సమావేశాలు జరిపామని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించిన అవినీతిని ప్రజలకు, మీడియాకు వివరించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణకు సిట్టింగ్ జడ్జిని నియమించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరామన్నారు. ‘పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యామని తెలిపారు.