తెరాస పై ఊ… అంటే ఒంటికాలితో లేచే నేతలను టార్గెట్ నేతలకు ప్రజలు తమ ఓటు రూపంలో బదులిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థులుగా చెప్పుకునే… కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డీకే అరుణ, జానారెడ్డి, జీవన్‌రెడ్డి,రేవంత్‌రెడ్డి లు కారు దాటికి చతికిల పడ్డారు . వీరి ఓటమిలో కాంగ్రెస్ అగ్రనేతలను ఓడించాలన్న గులాబీ అధినేత కేసీఆర్ వ్యూహం పూర్తిగా ఫలించినట్టు కనిపిస్తోంది.
జానారెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి, దామోదర రాజనర్సిహా, జీవన్‌రెడ్డి వంటి హేమాహేమీలే కాదు.. గెలుస్తారనుకున్న మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, షబ్బీర్ అలీ, సర్వే సత్యనారాయణ.. తదితరులు ఓటమి దిశగా సాగుతుండటం, పలువురు ఓటమి పాలు కావడం కాంగ్రెస్ పార్టీనిత తీవ్ర దిగ్భ్రాంతపరుస్తోంది. దేశవ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరంలో సత్తా చాటిన కాంగ్రెస్.. తెలంగాణలో వ్యతిరేక పవనాలు ఉండటం మరింత ఇబ్బంది కలిగించింది.