రాష్ట్రవ్యాప్తంగా ఓటు ఓటు హక్కు వినియోగంపై ప్రజలను చైతన్యవంతం చేయనున్నట్లు ప్రజా గాయకుడు గద్దర్ ప్రకటించారు. ఈమేరకు సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కుమార్ని కలిసి అనుమతివ్వాలని కోరారు. తెలంగాణలోని 31 జిల్లాల్లో మీట్ ద ప్రెస్ ద్వారా ఓటు హక్కు ప్రాధాన్యాన్ని వివరిస్తానని వివరించారు. ప్రజలు కోరుకుంటే గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని గద్దర్ ప్రకటించారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేస్తే దేశంలో 25శాతం ప్రజాస్వామ్యం బతికి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తెరాస అధినేత అధికారంలోకి రావడం కోసం నాడు ఎన్నికల సమరంలో రాష్ట్రంలో పేదలకు డబుల్ బెడ్రూం, దళితులకు మూడెకరాల భూమి, విద్యార్థులకు కేజీ టు పీజీ విద్య, అందరికీ ఆరోగ్యం, నిరుద్యోగులకు లక్ష కొలువులు కల్పిస్తామని మాట ఇచ్చారు..మరి అవన్నీ వచ్చాయా? అంటూ ప్రశ్నించారు. రాజకీయాలంటే పరస్పరం విమర్శలు ప్రతివిమర్శలు చేసుకోవడం కాదని ఆయన తెలిపారు.