రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిమండలం రాయ్‌దుర్గ్ పన్మక్త గ్రామంలోని సర్వే నంబర్ 5/3లో తనకుచెందిన 2,083 చదరపు అడగుల స్థలం విషయంలో రెవెన్యూఅధికారులు జోక్యం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ సినీనటుడు ప్రభాస్ హైకోర్టునుఆశ్రయించారు. తన ఆస్తి విషయంలో జోక్యం చేసుకోకుండా రెవెన్యూ అధికారులనునియంత్రించాలని కోరుతూ బుధవారం లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్థలాన్ని 2005లోబి.వైష్ణవీరెడ్డి, ఉషా, బొమ్మిరెడ్డి శశాంక్‌రెడ్డిల నుంచితాను చట్టబద్ధంగా కొనుగోలు చేశానని, ఈ భూమిపై ఎటువంటి వివాదాలు లేవనిప్రభాస్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఎటువంటి వివాదాలు లేకపోయినా ముందస్తుజాగ్రత్త చర్యగా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుని రూ. 1.05 కోట్లఫీజు కూడా చెల్లించామని, క్రమబద్ధీకరణ దరఖాస్తు ప్రభుత్వపరిశీలనలో ఉందని ప్రభాస్ వివరించారు. రెవెన్యూ అధికారులు తన భూమిని ప్రభుత్వభూమిగా చెబుతూ, ఆ భూమి నుంచి తను ఖాళీ చేయాలని కోరడాన్నిఆయన తప్పుబట్టారు.
వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పులో తాను పార్టీ కాదనివివరించారు. తీర్పును బూచిగా చూపుతూ తనను తన స్థలం నుంచి బలవంతంగా ఖాళీచేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకపిటిషనర్ తన వాదనలు వినడం గానీ, నోటీసు ఇవ్వడం గానీ చేయలేదన్నారు.
అయితేన్యాయ మూర్తి జస్టిస్సి.ప్రవీణ్‌కుమార్ ఈ పిటీషన్ పై విచారణ జరిపారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) ఎస్.శరత్‌కుమార్ స్పందిస్తూ.. ఈ మొత్తం వివాదం సివిల్ సూట్ (సీఎస్)7, 14లకు సంబంధించిందని, దీనిపై మరోధర్మాసనం విచారణ జరుపుతోందని వివరించారు. ఈ విషయా లతో తనకు సంబంధం లేదని, కావాలంటే కొద్దిసేపు విచారణను వాయిదా వేస్తానని, రిజిస్ట్రీ వద్దకువెళ్లి విషయం తెలుసుకోవాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో న్యాయమూర్తి తనముందున్న ప్రభాస్ పిటిషన్‌ను ధర్మాసనానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నేడుహైకోర్టులో విచారణ జరగనుంది.