తెలంగాణా ఎలక్షన్స్.. ఎన్.టి.ఆర్ ని ఆపింది అతనేనా..!

-

రీసెంట్ గా జరిగిన తెలంగాణా రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ టి.ఆర్.ఎస్ పార్టీ విజయ కేతనం ఎగురవేసిందని తెలిసిందే. మహాకూటమి ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి పప్పులు ఉండకలేదు. ఇదిలాఉంటే జరిగిన ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం కూకట్ పల్లి. అక్కడ మహాకూటమి తరపున టిడిపి అభ్యర్ధిగా స్వర్గీయ హరికృష్ణ తనయ నందమూరి సుహాసినిని నిలబెట్టారు.

అయితే ఆమె టి.ఆర్.ఎస్ అభ్యర్ధి మాధవరం కృష్ణారావు చేతుల్లో ఓడిపోయారు. ఆ టైంలో అక్క తరపున ఎన్.టి.ఆర్ కూడా ప్రచారం చేస్తాడని కొందరు వార్తలు రాశారు. అయితే సుహాసిని కోసం కేవలం బాలకృష్ణ, చంద్రబాబు వచ్చి వెళ్లారు. ఎన్.టి.ఆర్ రాకపోడానికి ముఖ్య కారణం మాత్రం దర్శకుడు త్రివిక్రం అని తెలుస్తుంది. అక్క కోసం మళ్లీ రాజకీయ ప్రచారంలోకి దిగాలా వద్దా అనుకుంటున్న తారక్ తనకు ఆప్తుడైన త్రివిక్రం సలహా అడిగాడట.

త్రివిక్రం వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్నావ్ కాబట్టి ఈ టైంలో వద్దని చెప్పాడట. త్రివిక్రం సలహా మేరకే ఈసారి తెలంగాణా ఎలక్షన్స్ లో ఎన్.టి.ఆర్ వేలు పెట్టలేదు. మరి ఏపి ఎలక్షన్స్ టైం లో తారక్ డెశిషన్ లో మార్పు వస్తుందేమో చూడాలి. అయితే త్రివిక్రం చెబితే ఎన్టీఆర్ ఆగిపోయాడా.. ఇదంతా నిజమేనా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news