చిల్లర బరువు తగ్గించుకోవడానికి, టీటీడీ సంచలన నిర్ణయం…!

-

గుడికి వెళ్తే చాలు జేబులో ఉండే నాణాలను విరాళంగా వేస్తూ ఉంటారు జనం. దాదాపు అన్ని దేవాలయాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల అయితే…? ఆ చిల్లర నాణాలు అంతా ఇంతా కాదు. దీనితో టీటీడీ గోడౌన్ లో ఉన్న దాదాపు 85 టన్నుల నాణాలను, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పంపేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

రోజు రోజుకి పెరిగిపోతున్న చిల్లరను తగ్గించుకునే ఆలోచన చేస్తుంది దేవస్థానం. ఫిబ్రవరి తొలి వారంలో ఈ నాణాలను తమిళనాడులో ఉన్న సేలంలోని సెయిల్ కర్మాగారానికి పంపుతామని, ఇవన్నీ ప్రస్తుతం చెలామణిలో లేనివేనని అధికారులు చెప్తున్నారు. గోడౌన్ లో చెల్లని నాణాలు అధిక స్థలాన్ని ఆక్రమించాయని, 2018లో చెల్లుబాటులో ఉన్న నాణాలను 90 వేల బ్యాగుల్లో బ్యాంకులకు పంపించింది.

వాటితో రూ. 30 కోట్ల ఆదాయాన్ని పొందింది టీటీడీ. జూలై 2011 తరువాత 25 పైసల కన్నా దిగువన ఉన్న నాణాలన్నీ చెలామణి నుంచి తొలగించారు. ఇప్పుడు అవి అన్ని టీటీడీకి భారంగా మారాయి. వీటి ముఖ విలువ ఇస్తే చాలని ఆర్బిఐ ని సంప్రదించగా, వారు అంగీకరించకపోవడంతో ముంబైలో ఉన్న మింట్ ని సంప్రదించగా సేలం స్టీల్ ప్లాంట్ కి వెళ్ళమని సూచించారట. మెట్రిక్ టన్ను నాణాలకు రూ. 29,972 ఇచ్చేందుకు సెయిల్ అంగీకరించింది. గత ఏడాది ఏప్రిల్ 18 న ఇందుకు కేంద్రం అంగీకరించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news