సూర్య భగవానునికి నమస్కారాలు ఆరోగ్యదాయకం! ఫిబ్రవరి 24 ఆదివారం- రోజువారి రాశిఫలాలు

-

మేషరాశి:
అనుకూలమైన రోజు, పనులు పూర్తి, విజయం, ఆనందం. లాభం. పరిహారాలు సూర్యనమస్కారాలు, నదీ లేదా సంగమ స్నానం చేస్తే మంచిది.

వృషభరాశి:
మంచి ఫలితాలు, పనులు పూర్తి, అన్నింటా జయం, లాభం, దేవదర్శన సూచన. పరిహారాలు గోసేవ, సూర్యనమస్కారాలు చేసుకోండి భవిష్యత్‌లో మంచి జరుగుతుంది.

మిథునరాశి:
మిశ్రమ ఫలితాలు, ధనవ్యయం, కొన్ని శుభసూచకాలు, అధికశ్రమ. పరిహారాలు సూర్యారాధన, నమస్కారాలు,చాలీసా పఠనం/శ్రవణం చేయండి.

కర్కాటకరాశి:
ప్రతికూలం. అధికశ్రమ, విరోధాలు, పనుల్లో జాప్యం, పిల్లల వల్ల ఇబ్బందలు. పరిహారాలు సూర్యనమస్కారాలు, దేవాలయ సందర్శన చేయండి మంచి జరుగుతుంది.

సింహరాశి:
అనుకూలమైన రోజు, భార్యతో అన్యోన్యత, కీర్తి, విందులు, ధనలాభం. పరిహారాలు ఇష్టదేవతారాధన, ఏదో ఒక మంచి పనిచేయండి.

కన్యారాశి:
మిశ్రమ ఫలితాలు, కార్యనష్టం, అధికశ్రమ, శుభకార్యప్రయత్నం, అనవసర కలహాలు. పరిహారాలు సూర్యారాధన, చాలీసా పారాయణం, గోసేవ వంటివి చేయండి.

తులారాశి:
అనుకూలం. కార్యలాభం, పనుల్లో వేగం, అన్నింటా జయం. పరిహారాలు ఇష్టదేవతారాధన చేసుకోండి.

వృశ్చికరాశి:
ప్రతికూలమైన రోజు, విరోధాలు, అనారోగ్య సూచన, పనుల్లో జాప్యం. పరిహారాలు సూర్యారాధన, రావిచెట్టుకు ప్రదక్షణలు/నమస్కారం చేసుకోండి మంచి జరుగుతుంది.

ధనస్సురాశి:
అనుకూలం. కీర్తి, ధనలాభం, అధికఖర్చు, విందులు, వినోదాలు. పరిహారాలు సూర్యనమస్కారం, గోసేవ చేయండి మంచి ఫలితం వస్తుంది.

మకరరాశి:
మిశ్రమం. ధనవ్యయం, ఆర్థిక ఇబ్బంది, వ్యసనాలతో ఇబ్బందులు, వ్యాపారాభివృద్ధి. పరిహారాలు సూర్యనమస్కారం, గోసేవ లేదా పేదవారికి అన్నం పెట్టండి మంచి జరుగుతుంది.

కుంభరాశి:
ప్రతికూల ఫలితాలు, ధననష్ట, అశాంతి, ఆటంకాలు. పరిహారాలు సూర్యనమస్కారాలు, గోసేవ లేదా పేదవారికి ఏదో ఒక సహాయం చేయండి.

మీనరాశి:
మిశ్రమం. కార్యలాభం,ఆటంకాలు, వ్యాపారనష్టం. పరిహారాలు సూర్యనమస్కారం, విష్ణువును మారేడుదళాలతో పూజించండి లేదా లక్ష్మీ స్తోత్రం చదవండి.

నోట్: సూర్యనమస్కారాలు అంటే ప్రాతఃకాలమే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలతో సూర్యునికి ఎదురుగా నిలబడి 12 సార్లు ఓం నమో భాస్కరాయనమః వంటి సూర్యనామాలతో ప్రార్థన. శరీరానికి లేత సూర్యకిరణాలు తగిలేటట్లు కనీసం ఐదు నిమిషాలు నిలబడండి. గోసేవ/పేదవారికి సహాయం అంటే దగ్గర్లోని గోశాల లేదా మీ ఇంటికి దగ్గర్లో ఆవులు కన్పిస్తే ఏదో ఒక పండో, ఫలమో, దానానో వేసి పృష్ట భాగాన్ని నమస్కారం చేసుకోండి. అన్నదానం అంటే జీహెచ్‌ఎంసీ ఐదురూపాయల భోజనం దగ్గర పది రూ॥ నుంచి మీ స్థాయిని బట్టి ఎంతో కొంతతో పేదవారి ఆకలి తీర్చండి. ఈ చిన్న ఫలితాలు మీ జీవితానికి చాలా ఉపయోగపడుతాయి. మేలు చేస్తాయి. ఓం నమో వేంకటేశ్వరాయనమః

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news